ఏపీలో విమానాలు టికెట్లు : స్పందనలో పేర్లు కంపల్సరీ

  • Published By: madhu ,Published On : May 25, 2020 / 02:12 AM IST
ఏపీలో విమానాలు టికెట్లు : స్పందనలో పేర్లు కంపల్సరీ

ఏపీలో విమానాలు ఎగరడానికి ఇంకాస్త టైం పట్టనుంది. లాక్ డౌన్ తో నిలిచిపోయిన విమాన సేవలు 2020, మే 25వ తేదీ సోమవారం నుంచి పున:ప్రారంభించుకోవచ్చని కేంద్ర పౌర విమానయాన సంస్థ నుంచి ఆదేశాలు అందాయి. దీంతో ఏపీలో విమానాశ్రయాలను రెడీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం ప్రధాన విమానాశ్రయాలను సిద్ధం చేశారు. విజయవాడ నుంచి ఏడు, విశాఖ, తిరుపతి నుంచి ఏడు సర్వీసులను నడపడానికి సిద్ధమయ్యారు. అయితే..ఇక్కడ ఆఖరి నిమిషంలో నిర్ణయం మారిపోయింది. విమానాల రాకపోకలకు కొన్ని ప్రభుత్వాలు అంగీకరించలేదు. దీనివల్ల రాష్ట్రానికి వచ్చే సర్వీసులు నిలిచిపోయాయి. బుధవారం నుంచి తిరిగి ప్రారంభించేలా అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. 

మరోవైపు…కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో…ప్రయాణీకులకు విధి విధానాలను వెల్లడించింది. తక్కువ కేసులున్న ప్రాంతం నుంచి వచ్చిన ప్రయాణీకుల నుంచి స్వాబ్ తీసిన తర్వాత..14 రోజుల పాటు హోం క్వారంటైన్ లోనే ఉండాలి. పరీక్షల్లో పాజిటివ్ వస్తే..ఇంట్లో లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ లోనైనా ఉండాలి. 

ప్రయాణీకులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. అనుమానిత లక్షణాలుంటే..వారం రోజులు ఇన్ స్టిట్యూషనల్ క్వారంటైన్ లో ఉంచుతారు. వారంతో తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు. నెగటివ్ వచ్చిన వారు మరో వారం రోజులు క్వారంటైన్ లో ఉండాలి. 

విమాన ప్రయాణం కోసం ముందుగా రాష్ట్ర ప్రభుత్వం స్పందన వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించి ప్రభుత్వం అనుమతించాకే..ప్రయాణానికి టికెట్లు కొనుక్కోవాలి. స్పందన ద్వారా అనుమతి పొందిన ప్రయాణీకులకే విమానయాన టికెట్లు ఇవ్వాలి.

Read: ‘మన పాలన-మీ సూచన’ పేరుతో ఏపీలో మేథోమధన సదస్సులు