Sameer Sharma : సమ్మె వద్దు… జీతాలు తగ్గవు- సీఎస్ సమీర్ శర్మ

ఐఆర్ తో సంబంధం లేకుండా జీతం పెరుగుతుందని చెప్పారు. ఎవరికీ జీతం తగ్గరాదని సీఎం చెప్పారని, ఉద్యోగులు అర్థం చేసుకుని 'ఛలో విజయవాడ', సమ్మె ఆలోచన వీడాలని ఆయన హితవు పలికారు.

Sameer Sharma : సమ్మె వద్దు… జీతాలు తగ్గవు- సీఎస్ సమీర్ శర్మ

Sameer Sharma

Sameer Sharma : మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చలు విఫలమయ్యాయి. ఉద్యోగులు ఉంచిన మూడు డిమాండ్లు తీర్చలేమని తేల్చేసింది మంత్రుల కమిటీ. ప్రభుత్వం జారీ చేసిన మూడు జీవోలను వెనక్కి తీసుకోవడం కుదరదని చెప్పింది. దీంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.

సమ్మె చేయాలన్న ఉద్దేశానికే ఉద్యోగులు కట్టుబడి ఉన్నారు. దీనిపై సీఎస్ సమీర్ శర్మ స్పందించారు. ఏ ఒక్కరికీ జీతాలు తగ్గబోవని, ఆ విషయం ఇవాళ రాత్రి జీతాలు వచ్చిన తర్వాత అర్థమవుతుందని అన్నారు. ఐఆర్ తో సంబంధం లేకుండా జీతం పెరుగుతుందని చెప్పారు. ఎవరికీ జీతం తగ్గరాదని సీఎం చెప్పారని, ఉద్యోగులు అర్థం చేసుకుని ‘ఛలో విజయవాడ’, సమ్మె ఆలోచన వీడాలని ఆయన హితవు పలికారు.

WhatsApp Alert : వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి..!

ఉద్యోగులకు శక్తిమేర చేయడానికే సీఎం ప్రయత్నిస్తున్నారని సమీర్ శర్మ వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని, మనందరం ఒకే కుటుంబం అని అన్నారు. ఈ రాత్రి 11 గంటల్లోగా కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు పడతాయని సీఎస్ వెల్లడించారు. పీఆర్సీ అంశంలో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేశారు.

అభ్యంతరాలను చర్చలతో పరిష్కరించుకునే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. సమస్యలకు సమ్మె పరిష్కారం కాదన్నారు. ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణను వాయిదా వేసుకోవాలని కోరారు. సమ్మెకు వెళ్లడం అంటే నష్టదాయకమేనని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల సమ్మెను అసాంఘిక శక్తులు కైవసం చేసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధమని మరోసారి తెలియజేస్తున్నామని స్పష్టం చేశారు.

Sleeping : బోర్లా పడుకుని నిద్రించే అలవాటుందా?..అయితే జాగ్రత్త?

‘ఇవాళ రాత్రిలోగా ఉద్యోగులకు జీతాలు. ఇవాళ జీతాలు రాని వారికి రేపు జమ చేస్తాం. జీతాలు కచ్చితంగా పెరుగుతాయి. అపోహలు వద్దు. పరిస్థితి చేజారిపోకుండా చూసుకోవాలి. సమస్యలకు సమ్మె పరిష్కారం కాదు. ఉద్యోగుల సమ్మెతో నష్టమే తప్ప లాభం లేదు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి. ఉద్యోగులతో ఓపెన్ మైండ్ చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉద్యమ కార్యాచరణను ఉద్యోగులు వాయిదా వేసుకోవాలి. ఉద్యోగ సంఘాలు చర్చలకు రావాలి’ అని సీఎస్ సమీర్ విజ్ఞప్తి చేశారు.

మరోవైపు మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చలు విఫలం కావడంతో.. ఉద్యమ కార్యాచరణ యథావిధిగా జరుగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 3న తలపెట్టిన ఛలో విజయవాడ.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.