Anantapur Drugs Gang : అనంతపురం జిల్లాలో డ్రగ్స్ కలకలం.. 20 గ్రాముల కొకైన్ స్వాధీనం

డ్రగ్స్ ను గోవా నుంచి హైదరాబాద్ కు సప్లయ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 40 ప్యాకెట్లలో 20.64 గ్రాముల కొకైన్ ఉన్నట్లు పోలీసులు చెప్పారు. పట్టుబడిన కొకైన్ విలువ మార్కెట్ లో రూ.6లక్షలకు పైనే ఉంటుందన్నారు.

Anantapur Drugs Gang : అనంతపురం జిల్లాలో డ్రగ్స్ కలకలం.. 20 గ్రాముల కొకైన్ స్వాధీనం

Anantapur Drugs Gang

Anantapur Drugs Gang : అనంతపురం జిల్లాలో డ్రగ్స్ కలకలం చెలరేగింది. డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంతకల్లు రైల్వే పార్సిల్ ఆఫీస్ వద్ద నిందితులు డ్రగ్స్ పంచుకుంటూ ఉండగా పోలీసులు ముగ్గురిని పట్టుకున్నారు. మరో ఇద్దరు పరార్ అయ్యారు. డ్రగ్స్ ను గోవా నుంచి హైదరాబాద్ కు సప్లయ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Drugs : హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం-ఆఫ్రికన్ దేశస్ధుడు అరెస్ట్

40 ప్యాకెట్లలో 20.64 గ్రాముల కొకైన్ ఉన్నట్లు పోలీసులు చెప్పారు. పట్టుబడిన కొకైన్ విలువ మార్కెట్ లో రూ.6లక్షలకు పైనే ఉంటుందన్నారు. గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సప్లయ్ చేసే నిందితులు.. గుంతకల్లులో ఎందుకు దిగారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పరారైన మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. నిందితులు గోవాలో గ్రాము కొకైన్ రూ.5వేలకు కొని హైదరాబాద్ లో రూ.15వేలకు అమ్ముతున్నట్టు పోలీసులు తెలిపారు.

గుంతకల్లు పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ నరసింగప్ప మీడియాకు వివరాలు తెలిపారు. గోవాకు చెందిన విజయ్ ప్రకాష్‌ నుంచి విజయవాడకు చెందిన పఠాన్‌ ఫిరోజ్‌ ఖాన్‌, కృష్ణ, రొనాల్డ్‌, కరణ్‌ షిండే, మధ్యప్రదేశ్‌కు చెందిన ఆకాష్‌ గంగూలీలు 20.64 గ్రాములు కొకైన్‌ (40 ప్యాకెట్లు), 1.43 గ్రాముల ఎండీ (మెఫడ్రోన్‌) డ్రగ్స్‌ కొనుగోలు చేశారు.

Elon Musk: ఒకప్పుడు కోకాకోలాలో కొకైన్ ఉండేదా?.. ఎలన్ మస్క్ ఏమన్నాడంటే.

వీరంతా ముఠాగా ఏర్పడి వాటిని హైదరాబాద్‌లో విక్రయించేందుకు ప్రణాళిక వేశారు. అందులో భాగంగా ఆదివారం గుంతకల్లు మీదుగా హైదరాబాద్‌కు రైలులో బయలుదేరారు. గుంతకల్లు పాత రైల్వే టికెట్ బుకింగ్‌ ఆఫీస్ దగ్గర దిగారు. అక్కడ వీరు అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. గుంతకల్లు పట్టణ సిఐ రామసుబ్బయ్య తన సిబ్బందితో అక్కడికెళ్లారు. పోలీసులు రాగానే ఐదుగురిలో ఇద్దరు పారిపోయారు. ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి కొకైన్‌‌, రెండు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు” అని డీఎస్పీ తెలిపారు.