Chittoor Man Head : పొట్టేలుకు బదులు మనిషి తల నరికిన కేసులో షాకింగ్ నిజాలు

చిత్తూరు జిల్లాలో పొట్టేలుకు బదులు మనిషి తల నరికిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో షాకింగ్ నిజాలు తెలిశాయి.

Chittoor Man Head : పొట్టేలుకు బదులు మనిషి తల నరికిన కేసులో షాకింగ్ నిజాలు

Chittoor Man Head

Chittoor Man Head : చిత్తూరు జిల్లాలో పొట్టేలుకు బదులు మనిషి తల నరికిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మద్యం మత్తులో పొరపాటున ఈ దారుణం జరిగిపోయిందని అంతా అనుకున్నారు. కాగా, ఈ కేసు విచారణలో షాకింగ్ నిజాలు తెలిశాయి. ఈ కేసులో నిందితుడు చలపతిని పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.

ఇది మద్యం మత్తులో పొరపాటున చేసింది కాదని, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని పోలీసులు విచారణలో తేలింది. హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పొట్టేలును నరకడానికి ముందు హతుడు సురేష్, చలపతిల మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. జాతరకు చందా ఇవ్వకపోవడమే కాకుండా వేడుకలో సురేష్ హడావుడి చేయడం చలపతికి నచ్చలేదని, ఈ కారణంగానే పొట్టేలును నరికే కత్తితో సురేష్ తలను చలపతి నరికాడని పోలీసులు వివరించారు.

Wife Gang Raped : దారుణం.. స్నేహితులతో కలిసి భార్యను గ్యాంగ్ రేప్ చేసిన భర్త

సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని వలసపల్లెలో ఆదివారం రాత్రి పశువుల పండుగ నిర్వహించారు. గ్రామానికి సమీపంలో ఉన్న ఎల్లమ్మ గుడికి గ్రామస్తులంతా రాత్రి ఏలుబోనాలు మోసి మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుల్లో భాగంగా అమ్మవారికి బలి ఇచ్చేందుకు పొట్టేలును తీసుకొచ్చారు. అదే గ్రామానికి చెందిన చలపతి.. పొట్టేలును నరికేందుకు ముందుకు వచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న చలపతి.. పొట్టేలును కదలకుండా పట్టుకున్న గ్రామానికి చెందిన సురేష్ తలను నరికేశాడు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కళ్ల ముందు జరిగిన ఘటన చూసి షాక్ తిన్నారు.

Corona Medicines : హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లు వాడాల్సిన మందులు.. ప్రభుత్వం మార్గదర్శకాలు

సురేష్ అక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయాడు. సురేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. తొలుత ఈ ఘటన పొరపాటున జరిగిందని అనుకున్నారు. కాగా, పాత కక్షలతోనే ఈ హత్య జరిగినట్లు, ప్లాన్‌ ప్రకారమే చలపతి ఇది చేసినట్లు పోలీసులు అనుమానించారు. చివరికి వారి అనుమానమే నిజమైంది.