దుర్గమ్మ జలవిహారం రద్దు, దుర్గగుడి ఫ్లై ఓవర్ పై పాదాచారులకు నో ఎంట్రీ

  • Published By: madhu ,Published On : October 24, 2020 / 01:25 PM IST
దుర్గమ్మ జలవిహారం రద్దు, దుర్గగుడి ఫ్లై ఓవర్ పై పాదాచారులకు నో ఎంట్రీ

Durgamma Teppotsavam Cancel : కృష్ణమ్మ నదిలో దుర్గమ్మ జలవిహారం రద్దైంది. వరద పోటు ఎక్కువగా ఉండడంతో రద్దు చేస్తూ..ఆలయ పాలకమండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే..హంస వాహనంపై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పరిమిత సంఖ్యలో వీఐపీలకు అనుమతించనున్నారు.



జల విహారం లేకపోవడంతో ఘాట్ లోకి భక్తులను అనుమతినివ్వడం లేదని దేవస్థానం స్పష్టం చేసింది. కేవలం ప్రకాశం బ్యారేజీపై మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుందని, 2020, అక్టో్బర్ 25వ తేదీ ఆదివారం సాయంత్రం దుర్గగుడి ఫ్లై ఓవర్ పై పాదాచారులకు అనుమతి ఉండదని వెల్లడించింది.



ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కొండపైనున్న దుర్గమ్మ..జలవిహారానికి ఆటంకం ఏర్పడింది. 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు ప్రవహిస్త్తోంది. ఈ క్రమంలో..కో ఆర్డినేషన్ కమిటీ 2020, అక్టోబర్ 24వ తేదీ శనివారం మధ్యాహ్నం భేటీ అయ్యింది. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తో పాటు, సీపీ బత్తిన శ్రీనివాసులు, దుర్గగుడి అర్చకులు, ఇతర అధికారులు హాజరయ్యారు. దుర్గమ్మ జలవిహారంపై ప్రధానంగా చర్చించారు.



గత సంవత్సరం వలే దసరా ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని, కానీ..ఈసారి వరదల వల్ల తెప్పోత్సవానికి ఆటంకం ఏర్పడిందని దుర్గగుడి ఈశో సురేష్ బాబు 10tv కి తెలిపారు. శివాలయం నుంచి అమ్మ, స్వామి వార్లు ఊరేగించి..కృష్ణా నదిలో హంస వాహనంపై అమ్మ, స్వామి వార్లకు వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. లైవ్ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.