K A Paul : తెలంగాణలో ముందస్తు ఎన్నికలు–కేఏ పాల్ జోస్యం

తెలంగాణకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని... తాను తెలంగాణకు ముఖ్యమంత్రి  అవుతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు.

K A Paul : తెలంగాణలో ముందస్తు ఎన్నికలు–కేఏ పాల్ జోస్యం
ad

K A Paul :  తెలంగాణకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని… తాను తెలంగాణకు ముఖ్యమంత్రి  అవుతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు.  ఈరోజు ఆయన తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను వచ్చినప్పటినుంచి కేసీఆర్ కు నిద్రపట్టటంలేదన్నారు.  ఉభయ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బరిలో దిగుతానని…ఏపీకి ఒక మహిళను ముఖ్యమంత్రిని చేస్తానని ఆయన వివరించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి వ్యాఖ్యానిస్తూ కేసీఆర్ ఖబడ్దార్… నేను బటన్ నొక్కితే జైలుకు పోతావు అంటూ హెచ్చరించారు. తాను అధికారంలోకి వచ్చాక రేప్ చేసే వారి సంగతి తేలుస్తానని కేఏపాల్ తెలిపారు.

సీమ నుంచి ఎన్నికైన సీఎం లు ఈ ప్రాంతానికి ఏమి చేయలేదని రాయలసీమను రాక్షస సీమగా మార్చారని కేఏ పాల్ ఆంధ్రప్రదేశ్ గురించి అన్నారు.  ఏపీ సీఎం జగన్ కూడా సీమకు అన్యాయం చేస్తున్నారన్నారు. అవినీతి, కుటుంబ పాలనకు ఇక ప్రజలు స్వస్తి పలకాలని ఆయన పిలుపునిచ్చారు.  రాష్ట్రాన్ని శ్రీలంక, సూడాన్, నైజీరియా, జింబాబ్వే దేశాలుగా చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు.  స్మార్ట్ సిటీలు, ప్రత్యేక హోదా, ప్యాకేజ్ లు ఏమయ్యాయని బీజేపీ నాయకులను కేఏపాల్ ప్రశ్నించారు.  ఒక శాతం ఓటు బ్యాంకులేని పవన్ కళ్యాణ్ బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో తెలియదని..మా పార్టీలోకి వస్తే ఆయనకు నెంబర్ టూ పొజీషన్ ఉంటుందన్నారు.

టిడిపి పని అయిపోయిందని… ఆ పార్టీని మా పార్టీలో విలీనం చేయండని తెలుగు తమ్ముళ్ళకు విజ్ఞప్తి చేశారు.  నేను పారిపోను, అందరినీ పరిగెత్తిస్తాను అని కేఏపాల్ చెప్పారు.  వచ్చే ఎన్నికల్లో వైసిపి కి 175 స్థానాల్లో ఈసారి డిపాజిట్ కూడా రాదని అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకోండని వైసీపీ నాయకులను హెచ్చరించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు   జగన్‌కు బదులుగా రోశయ్యను సీఎం గా చేయమని తానే అహమ్మద్ పటేల్‌కు చెప్పానన్నారు కేఏపాల్.

Also Read : Krishna Water : కృష్ణా మిగులు జలాల వాటాపై కేంద్రం స్పష్టత