తెలుగు రాష్ట్రాల్లో భూకంపం : భయాందోళనలో జనం

  • Published By: veegamteam ,Published On : January 26, 2020 / 03:08 AM IST
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం : భయాందోళనలో జనం

తెలుగు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. భూమి స్వల్పంగా కంపించింది. పలు సెకన్ల పాటు భూమిలో ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అర్థరాత్రి గాఢనిత్రలో ఉన్న సమయంలో ప్రకంపనలు వచ్చాయి. ఇంట్లోని వస్తువులు కదలడంతో ఉలిక్కిపడి లేచారు. ఆ వెంటనే భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. శనివారం(జనవరి 25,2020) అర్థరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో భూమి కంపించింది.

1

ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూకంపం వచ్చింది. తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట, కరీంనగర్ జిల్లాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల మూడు సెకన్లు, మరికొన్ని చోట్ల 10 సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 4.4గా నమోదైంది. స్వల్ప ప్రకంపనలు కావడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

 

3

దీనిపై జియోలాజికల్ సర్వే అధికారులు స్పందించారు. భయపడాల్సిన పని లేదన్నారు. ప్రకంపనలు సర్వ సాధారణం అన్నారు. వాటి తీవ్రత తక్కువగా ఉంటుందని, ఎలాంటి ప్రమాదం జరగదన్నారు. ఆందోళన పడాల్సిన పని లేదన్నారు. భూమి లోపలి పొరల్లో పలకల మధ్య ఒత్తిడి పెరిగి.. అప్పుడప్పుడు ఇలాంటి ప్రకంపనలు చోటు చేసుకుంటాయని వివరించారు.

22

* తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూకంపం
* శనివారం అర్థరాత్రి దాటాక కంపించిన భూమి
* కృష్ణా, గుంటూరు, ఖమ్మం, సూర్యాపేట, కరీంనగర్ జిల్లాల్లో ప్రకంపనలు
* ఖమ్మం జిల్లా మధిర, ముదిగొండ, కూసుమంచి, చింతకాని, నాగులవంచ, బస్వాపురం, పాతర్లపాడు మండలాల్లో ప్రకంపనలు

* సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో ప్రకంపనలు
* మేళ్లచెరువు, చింతలపాలెం, పాలకీడు మండలాల్లో ప్రకంపనలు
* రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.4గా నమోదు
* సూర్యాపేట జిల్లాలో 40 సెకన్ల పాటు కంపించిన భూమి

* చింతలపాలెం మండలంలో 20 రోజుల్లో 40సార్లు కంపించిన భూమి
* గుంటూరు జిల్లా బెల్లంకొండ, పిడుగురాళ్ల, మాచవరంలో, అచ్చంపేట, తాళ్లచెరువు, కొత్తపల్లిలో ప్రకంపనలు
* కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో భూప్రకంపనలు
* నందిగామ మండలాల్లో 10 సెకన్ల పాటు కంపించిన భూమి

* భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
* ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అధికారులు 
* ప్రకంనలు సర్వ సాధారణం
* భూమి లోపలి పొరల్లో పలకల మధ్య ఒత్తిడి పెరిగి స్థానభ్రంశం అవుతుండటంతో ప్రకంపనలు
* తీవ్రత తక్కువ.. ప్రమాదం లేదు