Earthquake In Kurnool: తుగ్గలి మండలంలో మరోసారి భూప్రకంపనలు.. పలు ఇండ్లకు పగుళ్లు ..
కర్నూల్ జిల్లాలోని తుగ్గలి మండలంలో మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రాతన గ్రామంలో తెల్లవారు జామున మరల ఐదు ఇళ్లకు పగులు వచ్చినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.

Earthquake In Kurnool
Earthquake In Kurnool: కర్నూల్ జిల్లాలోని తుగ్గలి మండలంలో మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రాతన గ్రామంలో తెల్లవారు జామున మరల ఐదు ఇళ్లకు పగులు వచ్చినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. వరుసగా భూ ప్రకంపనలు రావడంతో ఆ గ్రామంలోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సోమవారం అర్థరాత్రి సమయంలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవటంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. మరోసారి ఎక్కడ భూకంపం వస్తుందోనన్న భయంతో తెల్లవార్లు ఇళ్లలోకి వెళ్లకుండా రోడ్లపైనే స్థానిక ప్రజలు జాగరణ చేశారు.
Earthquake In Kurnool: కర్నూలు జిల్లాలో భూ ప్రకంపనలు.. భయంతో తెల్లవార్లు రోడ్లపైనే ప్రజల జాగరణ
భూప్రకంపనల ప్రభావంతో రాతన గ్రామంలో పలు ఇండ్లు, రోడ్లు పగుళ్లు వచ్చాయి. సోమవారం సాయంత్రం వచ్చిన భూ ప్రకంపనలకు రాతన గ్రామంలో సుమారు 15 ఇళ్లకు, సిమెంట్ రోడ్డుకు నెర్రలు వచ్చాయి. ఇళ్లకు పగుళ్లు వచ్చే స్థాయిలో భూకంపం వచ్చిందంటే.. భూకంప తీవ్రత ఎక్కువగానే ఉంటుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భూకంపం ప్రభావిత గ్రామంలో అధికారులు, స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి పర్యటించారు. భూప్రకంపనలకు నెర్రెలువారిన ఇళ్లను పరిశీలించారు.
Earthquake : అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.0 గా నమోదు
అయితే, మరోసారి గ్రామంలో భూమి కంపించిందని గ్రామస్తులు తెలిపారు. తెల్లవారు జామున మరల ఐదు ఇండ్లకు పగుళ్లు వచ్చినట్లు చెప్పారు. గ్రామంలో భూ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. సర్వే చేయాల్సిన అధికారులు పట్టించుకోవటం లేదని, జ్యూయజికల్ సర్వే అధికారులు ఇప్పటివరకు రాతనకు రాలేదని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రెవెన్యూ అధికారులు మాత్రమే పరిశీలన చేశారని, అసలు భూ ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకొనేందుకుసైతం అధికారులు ఆసక్తి చూపడం లేదని గ్రామస్తులు తెలిపారు. దీంతో, ఎప్పుడు భూమి కంపిస్తుందోనన్న భయంతో ఇళ్లలోకి వెళ్లాలంటే గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు.