Spinal Muscular Atrohphy : ఒక్క ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు.. పసిబిడ్డకు అరుదైన వ్యాధి, ఆదుకోవాలని తల్లి విన్నపం

పాప మళ్లీ నడిచేలా అరుదైన జబ్బుని నయం చేసుకోవాలని ఉన్నా.. ఒక్క ఇంజక్షన్ ఖరీదే ఏకంగా రూ.16కోట్ల రూపాయలు. ఆ ఇంజక్షన్ కూడా పాపకు రెండేళ్ల వయసులోపే ఇవ్వాలి. అంత ఖరీదైన వైద్యం అందించడం ఎలాగో తెలియక ఆ తల్లి తల్లడిల్లిపోతోంది.

Spinal Muscular Atrohphy : ఒక్క ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు.. పసిబిడ్డకు అరుదైన వ్యాధి, ఆదుకోవాలని తల్లి విన్నపం
ad

Spinal Muscular Atrohphy : తూర్పుగోదావరి జిల్లా శెట్టిపేటకు చెందిన ఓ పసిబిడ్డ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. పుట్టినప్పటి నుంచి కదల్లేని స్థితిలో ఉంది. ఆ పాప స్పైనల్ మస్కులర్ అట్రోపీ అనే అరుదైన వ్యాధితో అవస్థ పడుతోంది. ఏడాది వయసు దాటినా కాళ్లు కదిలించలేదు, చేతులు ఆడించలేదు. ఇదీ పాప దుస్థితి.

పాప అవస్థను చూసి కన్నతల్లి తల్లిడిల్లిపోతోంది. ఎక్కడా విననిది, ఇంకెక్కడా చూడనిది.. నా బిడ్డకే ఎందుకిలా అంటూ ఆ మాతృమూర్తి కన్నీటిపర్యంతం అవుతోంది. పాప మళ్లీ నడిచేలా అరుదైన జబ్బుని నయం చేసుకోవాలని ఉన్నా.. ఒక్క ఇంజక్షన్ ఖరీదే ఏకంగా రూ.16కోట్ల రూపాయలు. ఆ ఇంజక్షన్ కూడా పాపకు రెండేళ్ల వయసులోపే ఇవ్వాలి. అసలే పేద కుటుంబం. రోజు గడవడమే కష్టం. అలాంటిది అంత ఖరీదైన వైద్యం అందించడం ఎలాగో తెలియక ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. పాపకు వైద్యం చేయించలేక, కళ్ల ముందు కన్నబిడ్డ నరకం చూడలేక విలపిస్తోంది. కనీసం మెర్సీ కిల్లింగ్ కు అయినా అనుమతించాలని కోరుకుంటోంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందని చిన్నారి దయాశాంతి దుస్థితి ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది.

18 నెలల వయసున్న దయాశాంతి ప్రపంచంలోనే వింత జబ్బు బారిన పడింది. రూ.16కోట్లు ఖర్చు పెడితే కానీ ఆ జబ్బు నయం కాదు. పాపకు రెండేళ్ల వయసులోపే ఆ ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే పాప చనిపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పారు. ఎవరైనా స్పందించి తన పాపను ఆదుకోవాలని, సాయం చేయాలని పాప తల్లి వేడుకుంటోంది.

స్పైనల్ మస్కులర్ అట్రోపీ.. చాలా అరుదైన జబ్బు. దీని కారణంగా ఎముకలు, నరాల్లో పెరుగుదల ఆగిపోతుంది. కాగా, ఈ రేర్ డిసీజ్ కు వైద్యం అందుబాటులో ఉన్నా.. చాలా ఖరీదుతో కూడుకున్నది. కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్క జోయిల్ జె ఇంజక్షన్ ఖరీదే రూ.16కోట్లు ఉంటుంది. పాప తల్లి సూర్యకుమారి తనకు సాయం చేయాలంటూ స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్ కు విన్నవించారు. కానీ, ఎవరి దగ్గరా హామీ దొరకలేదు. దీంతో ప్రభుత్వమే తమ పాపను ఆదుకోవాలని తల్లి సూర్యకుమారి వేడుకుంటున్నారు.