AP : సీఎం జగన్ కు ముద్రగడ లేఖ..ఆ విషయాల్లో ఆనందం పొందలేని జీవితం నాది..నేను ఏనాడో చేసుకున్న పాపం అది

ఈరెండు విషయాల్లో ఆనందం పొందలేని జీవితంనాది..నేనే ఏనాడో చేసుకున్న పాపం అనుకుంటానని ఆవేదిన వ్యక్తం చేస్తు..మాపై కేసులు ఎత్తివేసిందుకు ధన్యవాదాలు అంటూ ముద్రగడ సీఎం జగన్ కు లేఖరాశారు

AP : సీఎం జగన్ కు ముద్రగడ లేఖ..ఆ విషయాల్లో ఆనందం పొందలేని జీవితం నాది..నేను ఏనాడో చేసుకున్న పాపం అది

Mudragada Padmanabham Ap Cm Jagan Letter

Mudragada padmanabham ap cm jagan letter : ఏపీ సీఎం కాపు ఉద్యమ నేత,జగన్‌కు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపు ఉద్యమంలో పెట్టిన కేసులు కేబినెట్ మీటింగ్ లో పెట్టి ఉపసంహరించినందుకు సీఎం జగన్ కు ముద్రగడ ధన్యవాదాలు తెలిపారు. తాము చెయ్యని నేరానికి తమను ముద్దాయిలను చేస్తూ పెట్టిన కేసులు చాలా అన్యాయమని.. తమ జాతి తనను ఉద్యమం నుంచి తప్పించినా మీరు ఆ కేసుల్ని ఎత్తివేసినందుకు ధన్యావాదాలు అని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.కేసులు ఉపసంహరించటం వల్ల తనకు చాలా సంతోషంగా ఉందని.. తెలిపారు.

ఈ రెండు విషయాల్లో ఆనందం పొందలేని జీవితమని.. తనకు జరిగిన అవమానాలు, బాధలు, కష్టాలు, బూతు పురాణాలు వీటిని ఎవరైనా ద్రుష్టిలో పెట్టుకుంటే భవిష్యత్‌లో ఉద్యమాలు చేయడానికి ఎవరూ రోడ్డు మీదకు రారన్నారు. ఏపీ సీఎం కాపు ఉద్యమ నేత,జగన్‌కు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపు ఉద్యమంలో పెట్టిన కేసులు కేబినెట్ మీటింగ్ లో పెట్టి ఉపసంహరించినందుకు సీఎం జగన్ కు ముద్రగడ ధన్యవాదాలు తెలిపారు. తాము చెయ్యని నేరానికి తమను ముద్దాయిలను చేస్తూ పెట్టిన కేసులు చాలా అన్యాయమని.. తమ జాతి తనను ఉద్యమం నుంచి తప్పించినా మీరు ఆ కేసుల్ని ఎత్తివేసినందుకు ధన్యావాదాలు అని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.కేసులు ఉపసంహరించటం వల్ల తనకు చాలా సంతోషంగా ఉందని.. తెలిపారు.

Also read : AP PRC: ఐఆర్ అంటే వడ్డీలేని రుణం అని ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలోనూ లేదే..పీఆర్సీని కూడా రుణం అంటారేమో..!

అప్పుడు సీఎంగా నారా చంద్రబాబు బీసీ-ఎఫ్ ఫైలును కేంద్రానికి ఆమోదం కోసం పంపిస్తున్నప్పుడూ.. ఇప్పుడు కాపులపై కేసులు ఎత్తివేసినప్పుడు తానే స్వయంగా వచ్చి అప్పుడు, ఇప్పుడు ధన్యవాదాలు చెప్పాలనుకున్నానని లేఖలో ప్రస్తావించారు ముద్రగడ. కానీ అందరిలా తాను అపరకోటీశ్వరుడ్ని కాదని.. సమాజం పోకడ మాత్రం ఇద్దర్ని అంటే అప్పుడు చంద్రబాబును ఇపప్పుడు జగన్ ను తాను కలిస్తే తమవారు (అంటే కాపులు అని కావచ్చు) పదవుల కోసమే అని అనుకుంటారని అందుకే వెళ్లలేకపోయానని తెలిపారు.

ఈ రెండు విషయాల్లో ఆనందం పొందలేని జీవితం నాది అనీ..తనకు జరిగిన అవమానాలు, బాధలు, కష్టాలు, బూతు పురాణాలను ఎవరైనా దృష్టిలో పెట్టుకుంటే ఎవ్వరు ఉద్యమాలు అంటూ ఎవరూ రోడ్డు మీదకు రారని, రాకూడదని ముద్రగడ అభిప్రాయపడ్డారు. చాలామంది పెద్దవారు రకరకాల సమస్యల వంకతో చంద్రబాబు, జగన్ దగ్గరకు వెళ్లినా తప్పుపట్టరు కానీ తాను మాత్రం పదవుల కోసమే వెళతారని అపార్థం చేసుకుంటారని ఇది నేను ఏనాడో చేసుకున్న పాపం అనుకుంటానని ముద్రగడ ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే కేసులు ఉపసంహరించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ మరోసారి ప్రస్తావించారు.

Also read : Mudragada Padmanabam : కోడిపందాలకు పర్మిషన్ ఇవ్వండి.. జగన్‌కు ముద్రగడ లేఖ 

కాగా జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ముద్రగడ కాపు ఉద్యమం అంటూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.రైలును తగుల బెట్టిన ఘటనలు కాపు ఉద్యమానికి మాయని మచ్చ తెచ్చింది. దీంతో ముద్రగడతో పాటు పలువురు కాపు నేతలపై కేసులు పెట్టిన ఘటన ఆనాడు జరిగింది. ఆ కేసుల్ని ఈనాడు జగన్ సర్కార్ మకాపు రిజర్వేషన్ ఉద్యమం సమయంలో నమోదైన కేసులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. కాపు రిజర్వేషన్ ఉద్యమ కారులపై చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నమోదైన మొత్తం 161 కేసులను ఉపసంహరించుకుంది జగన్ ప్రభుత్వం. 2016 జనవరి నుంచి 2019 మార్చి వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నమోదైన కేసులు ఎత్తివేస్తూ హోంశాఖ కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా కాపు ఉద్యమంలో భాగంగా 2016 జనవరిలో నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా తుని కార్యక్రమంలో పలువురు ఆందోళనకారులు రైలుకు నిప్పుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మరో 17 కేసులల్లో విచారణను ఉపసంహరించుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2020లో ఉత్తర్వులు జారీ చేసింది.తూర్పు గోదావరి జిల్లా తుని రూరల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన 17 కేసులను ఉపసంహరించకుంది. డీజీపీ సిఫార్సుల మేరకు ఈ కేసులను ఉపసంహరిస్తున్నట్లు తెలిపారు. అలాగే రైలును తగులబెట్టిన ఘటనకు సంబంధించి మొత్తం 69 కేసులు నమోదు కాగా, ఇప్పటికే 51 కేసులను 2019లో జగన్ సర్కార్ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

Also read : Tees Maar Khan: పాప ఆగవే.. ఆగి చూడవే.. టీజ్ చేస్తున్న ఆది!

కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ సామాజిక వర్గానికి చెందినవారు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2016 జనవరిలో తుని కార్యక్రమంలో ఆందోళనకారులు రైలుకు నిప్పుపెట్టడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. దీనిపై అప్పటి ప్రభుత్వం మొత్తం 69 కేసులను నమోదు చేసింది. గత ఎన్నికల సమయంలో ఆ ఘటనకు సంబంధించి కేసులను మాఫీ చేస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం మొత్తం కేసులను ఉపసంహరించుకున్నారు.