AP Skill Development Scam : ఏపీలో రూ.234 కోట్ల స్కామ్, 26మందికి ఈడీ నోటీసులు

AP Skill Development Scam : ఏపీలో రూ.234 కోట్ల స్కామ్, 26మందికి ఈడీ నోటీసులు

AP Skill Development Scam : ఏపీలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిపైన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఫోకస్ చేసింది. ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ కలకలం రేపుతోంది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో 2014 నుంచి 2019 మధ్య కాలంలో భారీ అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది.

ఈ కేసులో నిందితులుగా ఉన్న 26మందికి నోటీసులు జారీ చేసింది ఈడీ. రూ.234 కోట్ల నిధులు దారి మళ్లించినట్లు ఈడీ తేల్చింది. పుణెలో పలు షెల్ కంపెనీలు క్రియేట్ చేసి వాటి ద్వారా నిధులు మళ్లించినట్లు గుర్తించింది ఈడీ. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంటా సుబ్బారావు, మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, ఓఎస్డీ నిమ్మగడ్డ కృష్ణ ప్రసాద్ తో పాటు మొత్తం 26మందికి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.

ఇన్ వెబ్ సర్వీస్ నుంచి సీమెన్స్ కంపెనీలకు నిధులు మళ్లించినట్లు ఈడీ తేల్చింది. షెల్ కంపెనీలు క్రియేట్ చేసి నిధులు దారి మళ్లించినట్లు గుర్తించింది. గంటా సుబ్బారావుకి చెందిన ప్రతీక్ ఇన్ ఫో సర్వీసెస్ కు, లక్ష్మీనారాయణకు చెందిన ఐటీ సొల్యూషన్స్ కు కోట్ల నిధులు మళ్లించినట్లు గుర్తించారు ఈడీ అధికారులు.

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ పై ఫోకస్ పెట్టిన ఈడీ.. రూ.234 కోట్ల నిధుల మళ్లింపునకు సంబంధించి కేసు నమోదు చేసింది. పలు షెల్ కంపెనీల సాయంతో నిధుల మళ్లింపు జరిగినట్లు గుర్తించిన ఈడీ.. ఈ నిధుల మళ్లింపు వ్యవహారంపై విచారణకు హాజరుకావాలంటూ మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసింది. సోమవారం హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో సూచించింది.

స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో నిరుద్యోగులకు శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన కోసం గతంలో చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన నిధులు దుర్వినియోగం అయ్యాయని భావించిన జగన్ సర్కార్ సీఐడీకి విచారణను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మనీలాండరింగ్ కోణం ఉందని భావించిన సీఐడీ.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు సమాచారం అందించింది. దీంతో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కాంపై ఈడీ దృష్టి సారించింది. తాజాగా ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేసింది.