ED Raids : జేసీ ప్రభాకర రెడ్డి ఇంట్లో ఈడీ తనిఖీలు

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర రెడ్డి ఇంటిపై ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ అధికారులు ఈరోజు ఉదయం దాడి చేశారు.

ED Raids : జేసీ ప్రభాకర రెడ్డి ఇంట్లో ఈడీ తనిఖీలు

Amaravati Farmers Yatra

ED Raids  : అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర రెడ్డి ఇంటిపై ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ అధికారులు ఈరోజు ఉదయం దాడి చేశారు. తెల్లవారుఝామున ఇంటికి వచ్చిన అధికారులు ఇంట్లో తనిఖీలు  నిర్వహిస్తున్నారు.

కుటుంబ సభ్యులు ఫోన్లను స్వాధీనం చేసుకుని సోదాలు నిర్వహిస్తున్నారు, జేసీ ఆస్తులకు సంబంధించి పలు పత్రాలను తనిఖీ చేస్తున్నారు. జేసీ ఇంట్లోకి ఎవరినీ రానివ్వటం లేదు. జేసీ దివాకర రెడ్డి ఇంటి పరిసరప్రాంతాల్లో భారీగా పోలీసులను మొహరించారు. జేసీ ఇంటికి వెళ్లే అన్ని రహదారుల్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఫోర్జరీ డాక్యుమెంట్లతో వాహనాలు రిజిస్ట్రేషన్లు చేయించారనే ఆరోపణతో ఈ తనిఖీలునిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.  జేసీ ట్రావెల్స్   స్క్రాప్ కింద వాహనాలు కొనుగోలు చేసి… నకిలీ ఇన్వాయిస్‌తో  నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  సుమారు వందకు పైగా వాహనాలకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించినట్టు భావిస్తున్నారు.

మరోవైపు జేసీ ముఖ్య అనుచరుడు చవ్వాగోపాల్ రెడ్డి ఇంట్లో కూడా ఈటీ సోదాలు చేస్తోంది.   వారి ఆస్తులకు సంబంధించిన పత్రాలను మొత్తం 20 మంది సిబ్బంది పరిశీలిస్తున్నారు.  తాడిపత్రిలో భారీ బందోబస్తు నడుమ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లోనూ జేసీ సోదరుల నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. సోదాలు కొనసాగుతున్నాయి.

Also Read : Agnipath Scheme : అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు..స్కీమ్‌ రద్దు చేయాలని డిమాండ్