రోజు పాలు..గుడ్డు : వైఎస్సార్ బాల సంజీవని పథకం

రాష్ట్రంలోని గిరిజనుల ప్రాంతాల్లోని అంగన్ వాడీ, కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు వైఎస్సార్ బాల సంజీవని కిట్ కింద అదనపు పోషకాహారాన్ని అందించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చే

రోజు పాలు..గుడ్డు : వైఎస్సార్ బాల సంజీవని పథకం

Egg And Milk Every Day Mid

రాష్ట్రంలోని గిరిజనుల ప్రాంతాల్లోని అంగన్ వాడీ, కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు వైఎస్సార్ బాల సంజీవని కిట్ కింద అదనపు పోషకాహారాన్ని అందించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులకు ప్రస్తుతం కొన్ని రోజుల చొప్పున ఇస్తున్న గడ్డు, పాలును ఇకపై ప్రతి రోజు అందించాలన్నారు. 2019, అక్టోబర్ 23వ తేదీ బుధవారం మధ్యాహ్న భోజన పథకంపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. గర్భవతులు, బాలింతలకు నెలకు రూ. 1062 విలువైన ఆహారం అందించాలని, 25 రోజుల పాటు భోజనం, గుడ్డు, 200 మి.లీ పాలు, అదనంగా రూ. 500 విలువ చేసే బాల సంజీవని కిట్ పంపిణీ చేయాలన్నారు.

వైఎస్సార్ బాలామృతం కిట్ నెలకు 2.5 కిలోల పౌష్టికాహారాన్ని ఇవ్వాలని, మొత్తంగా నెలకు రూ. 600 విలువ చేసే ఆహారం అందచేయాలన్నారు సీఎం జగన్. అంగన్ వాడీ కేంద్రాల్లోనే భోజనం తయారు చేయించాలని, మధ్యాహ్నం లడ్డు, బిస్కెట్, పాయసాల్లో ఏదైనా ఒకటి ఇవ్వాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో అదనపు పోషకాహారాన్ని ఇవ్వడం వల్ల 3.80 లక్షల మంది గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు లబ్ది చేకూరుతుందన్నారు. మధ్యాహ్న భోజన విషయంలో నాణ్యత, పోషక విలువలు పెంచడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
Read More : సీఎం కావాలని పగటి కలలు కనలేదు : బెంబేలెత్తే వ్యక్తిని కాదు