Eight died in road accidents : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది కన్నుమూశారు. నెల్లూరు జిల్లా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు మరణించగా..... హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడి కక్కడే మరణించారు.

Eight died in road accidents : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి

Eight Died In Road Accidents

Eight died in two road accidents in two telugu states : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది కన్నుమూశారు. నెల్లూరు జిల్లా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు మరణించగా….. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడి కక్కడే మరణించారు.

నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు వద్ద మంగళవారం తెల్లవారు ఝూమున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దువ్వూరు దళితవాడకు చెందిన 14 మంది కూలీలు కొడవలూరు మండలం రాజుపాలెం చెరువుల్లో చేపలు పట్టటానికి వెళ్ళేందుకు నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై ఆటో ఎక్కుతుండగా… వెనుకనుంచి వేగంగా వచ్చిన పాలవాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిననలుగురు అక్కడి కక్కడేమరణించగా….మరోకరు ఆస్పత్రిలో చికిత్స పొందతూ మరణించారు.  వ్యాన్ డ్రైవర్ తో సహా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడిన వారిని బుచ్చి, నెల్లూరు ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. మరణించిన వారిని దువ్వూరు గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన కె.బాబు(55), టి. రమణయ్య(60), కె. మాలకొండయ్య(50), జి. శీనయ్య(50), ఎం‌.శీనయ్యగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బుచ్చిరెడ్డిపాలెం సీఐ సురేష్ బాబు, సంగం ఎస్సై శ్రీకాంత్ ఘటనాస్ధలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణలోని..హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద, అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోమంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగివున్న లారీని వెనుకనుంచి కారుఢీ కొట్టటంతో కారు లో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగంగా కారు లారీని ఢీకొట్టటంతో…మృతదేహాలు ఇరుక్కుపోయాయి.

మృతదేహాలను స్థానికుల సహాయంతో బయటకి తీసారు. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్డు అయ్యింది. మరిణించినవారిని సరూర్ నగర్ కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనలో కారు డ్రైవర్‌ ప్రభాకర్‌(30), ఉపేందర్‌ నాథ్‌(45), ఆయన కుమారుడు రోషిక్‌(27) ప్రమాద స్ధలంలోనే కన్ను మూశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.