Election Results 2021 : తిరుపతిలో వైసీపీ, సాగర్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం(మే 2,2021) ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ట్రెండ్స్ చూస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.

Election Results 2021 : తిరుపతిలో వైసీపీ, సాగర్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

By Poll

Election Results 2021 : దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం(మే 2,2021) ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. వెస్ట్ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అసోం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి వేర్వేరు విడతల్లో ఎన్నికలు జరిగాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని తిరుపతి లోక్ సభ, నాగార్జున్ సాగర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వాటి ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతోంది.

ఇప్పటివరకు ట్రెండ్స్ చూస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. తిరుపతిలో అధికార వైసీపీ లీడ్ లో ఉంది. పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీ ముందుంది. ఇక తెలంగాణలోని నాగార్జున సాగర్ లో అధికార టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ 1475 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాడు. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ కు 4228 ఓట్లు రాగా, కాంగ్రెస్ 2753 ఓట్లు వచ్చాయి. మూడో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 2665 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మూడో రౌండ్ లో టీఆర్ఎస్ కు 3421, కాంగ్రెస్ కు 2882 ఓట్లు వచ్చాయి.

ఇప్పటివరకు ఫలితాల సరళిని గమనిస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. తమిళనాడు డీఎంకే దూసుకెళ్తోంది. డీఎంకే లీడ్ లో ఉంది. ఇక కేరళలో ఎల్డీఎఫ్ కూటమి, పుదుచ్చేరిలో ఆల్ ఇండియా అన్నా కాంగ్రెస్ ఎన్డీయే కూటమి, అసోంలో బీజేపీ కూటమి ముందంజలో ఉన్నాయి.

బెంగాల్ లో టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తోంది. తృణమూల్, బీజేపీ మధ్య పోటాపోటీ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యేలా రెండు పార్టీల మధ్య హోరాహోరి నెలకొంది. నువ్వా నేనా అన్నట్టు రెండు పార్టీలు లీడ్ కోసం పోటీ పడుతున్నాయి. టీఎంసీ లీడ్ లో ఉంది. బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉంది.

తొలి నుంచి అంతా భావిస్తున్నట్టుగానే తమిళనాడులో డీఎంకే లీడ్ లో ఉంది. స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే స్పష్టమైన మెజార్టీ సాధిస్తోంది. తొలి రౌండ్ నుంచే డీఎంకే అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. అన్నాడీఎంకే పార్టీ రెండో స్థానంలో ఉంది.