Two Wheelers : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బైక్‌లు.. తక్కువ వడ్డీకే రుణం

జగన్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు లక్షకుపైగా

Two Wheelers : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బైక్‌లు.. తక్కువ వడ్డీకే రుణం

Cm Jagagn

Electric Two Wheelers : జగన్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు లక్షకుపైగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మోటార్ సైకిళ్లు, స్కూటర్ల తయారీ సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానిస్తుండగా..ఏప్రిల్ 10 నాటికి బిడ్డింగ్ ప్రక్రియ పూర్తి కానుందని తెలుస్తోంది. అంపేర్, ఒకినావా తదితర వెహికల్స్ తయారీ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. దీని వల్ల టూ వీలర్స్ కంపెనీలకు కూడా రూ.500 నుంచి వెయ్యి కోట్ల ఆదాయం లభించనుంది.

ఉద్యోగులకు తక్కువ ధరకు, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు ఎలక్ట్రిక్ టూవీలర్స్ కొనుగోలు చేసుకునేందుకు ప్రభుత్వం చేయూతనివ్వనుంది. ఆకర్షణీయ ధరలకు దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్‌ సంస్థల నుంచి ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌లను కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పించేందుకు సిద్ధమవుతోంది. ఏపీ ప్రభుత్వం ఈ విషయమై ఇప్పటికే తక్కువ వడ్డీ రేటు అందించేందుకు.. వాహన సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు మొదలుపెట్టింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్ఎల్‌)తో పని చేయనుంది.

ఈ ఎలక్ట్రిక్‌ బైకులను ప్రభుత్వ ఉద్యోగులకు అందించనున్నారు. తక్కు వడ్డీకే లోన్లు ఇప్పించేందుకు బ్యాంకులతో పాటు.. కేఎఫ్‌డబ్ల్యూ, జీఐజడ్ వంటి గ్లోబల్ సంస్థలతోనూ ప్రభుత్వ వర్గాలు చర్చిస్తున్నాయి. ఇప్పటికే అంపేర్‌, ఒకినావా వంటి విద్యుత్‌ ఆధారిత వాహనాల తయారీ సంస్థలు బైక్ లు సరఫరా చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని తెలుస్తోంది. ఏప్రిల్‌ 10లోపు బిడ్లు దాఖలవుతాయని భావిస్తున్నారు. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఈఈఎస్‌ఎల్‌తో పాటు ధర్మల్‌ విద్యుత్‌ సంస్థ ఎన్టీపీసీ ఆర్థిక పరంగా చేయూతనివ్వడానికి ముందుకు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ నూతన, సంప్రదాయేతర ఇంధన అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ రమణారెడ్డి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఎలక్ట్రిక్‌ బైక్ ల వినియోగం పెరుగుతందని భావిస్తున్నారు. ఇక అధికారులు ఇప్పటి నుంచే ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్‌ టూవీలర్స్ సరఫరా చేయడానికి, వాహనాల సర్వీసింగ్ కోసం 13 జిల్లాల్లోని 650 మండలాలు, 100 మునిసిపాలిటీల్లో వసతుల ఏర్పాట్లపై దృష్టి సారించారు.