ఏలూరులో వింత వ్యాధికి పురుగుమందుల అవశేషాలే కారణం

ఏలూరులో వింత వ్యాధికి పురుగుమందుల అవశేషాలే కారణం

Eluru Mystery Disease : ఏలూరులో వింత వ్యాధికి పురుగుమందుల అవశేషాలే కారణమని ఎయిమ్స్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ సహా ప్రఖ్యాత సంస్థలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. గత కొన్ని రోజులుగా ఏలూరులో వింత వ్యాధి కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. న్యూఢిల్లీ ఎయిమ్స్ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీకి సీఎం జగన్ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. దీనిపై రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి అందచేయనున్నారు. అసలు ఈ వ్యాధి ఎలా వ్యాపించిందనే దానిపై ఢిల్లీ ఏయిమ్స్ ప్రతినిధులు శాంపిల్స్ సేకరించారు. దీనిపై అధ్యయనం చేశారు.

ఈ క్రమంలో…2020, డిసెంబర్ 16వ తేదీ బుధవారం సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మనుషుల శరీరాల్లోకి పురుగుమందులు ప్రవేశించాయన్నదానిపై దీర్ఘకాలంలో మరింత అధ్యయనం అవసరమన్ననిపుణులు వెల్లడించారు. క్రమం తప్పకుండా పరీక్షలు చేయాలన్న సీఎం జగన్ సూచించారు. ప్రతి జిల్లాలో కూడా ల్యాబులు ఏర్పాటు చేయాలని, క్రమం తప్పకుండా ఆహారం, తాగునీరు, మట్టి నమూనాలపై పరీక్షలు చేయాలని ఆదేశించారు. ఫలితాలు ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై కార్యాచరణ రూపొందించాలని సీఎస్‌కు సూచించారాయ. ఏలూరు తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. ఆర్బీకేల ద్వారా సేంద్రీయ పద్ధతులు, వ్యవసాయానికి పెద్దపీట వేయాలని సీఎం జగన్ తెలిపారు.