Kidnapped : ఇంజనీరింగ్ విద్యార్థి కిడ్నాప్, హత్య

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోతవరంలో జరిగిన ఈ ఘటనలో విద్యార్థి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. చదువుకుని చేతికి అందివస్తాడనుకున్న కొడుకు చనిపోవటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

10TV Telugu News

AP Crime : పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోతవరంలో జరిగిన ఈ ఘటనలో విద్యార్థి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. చదువుకుని చేతికి అందివస్తాడనుకున్న కొడుకు చనిపోవటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

పోతవరానికి చెందిన వంశీ అనే ఇంజనీరింగ్ విద్యార్థిని కిడ్నాపర్ల అపహరించారు. అనంతరం వంశీ కుటంబాన్ని రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో వంశీ తండ్రి తన కొడుకు కిడ్నాప్ గురించి వారు డిమాండ్ చేసిన నగదు గురించి చెప్పి ఎలాగైనా నా కుమారుడ్ని కాపాడండీ సార్..అంటూ వేడుకున్నాడు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంశీ కోసం గాలింపు చేపట్టారు. వంశీ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలుసుకున్న కిడ్నాపర్లు వంశీని హత్య చేసి మృతదేహాన్ని పోతవరం గ్రామ శివారుల్లో పడవేశారు.

10TV Telugu News