పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ తప్పనిసరి : విద్యాశాఖా మంత్రి

  • Edited By: veegamteam , November 8, 2019 / 11:09 AM IST
పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ తప్పనిసరి : విద్యాశాఖా మంత్రి

ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ భాష తప్పనిసరి అని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సరేశ్ అన్నారు.ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియంను తప్పనిచేస్తూ అన్నిచర్యలు తీసుకంటున్నామనీ..దీని కోసం స్పష్టమైన ప్లాన్ ప్రకారంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడతామని స్పష్టంచేశారు.   

దీంట్లో భాగంగా..వచ్చే సంవత్సరం 9,10వ క్లాసుల స్టూడెంట్స్ కు వెసులుబాటు ఉంటుందన్నారు.  8వ క్లాస్ స్టూడెంట్స్ కు స్పెషల్ క్లాసుల్ని నిర్వహిస్తామని దీనికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సురేశ్ తెలిపారు. 

క్లాసుల్లో ఇంగ్లీస్ టీచింగ్ కు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఈ వేసవి నుంచే టీచర్లకు స్పెషల్ ట్రైనింగ్ ఇప్పిస్తామనీ..స్కూల్స్ లో ఇంగ్లీష్ లాంగ్వెజ్ అమలు చేసే విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయనీ..ఇది సరైనది కాదని మంత్రి అన్నారు.