KS Jawahar : జీవో 35తో సీఎం జగన్ చిత్రపరిశ్రమకు బుల్లెట్ దింపారు- మాజీ మంత్రి జవహర్

ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి కేఎస్ జవహర్ మండిపడ్డారు. జీవో నెం 35తో సీఎం జగన్ చిత్ర పరిశ్రమకు బుల్లెట్ దింపారని అన్నారు. సినిమా హాళ్ల నిర్వహణలోని వ్యయ ప్రయాసలు

KS Jawahar : జీవో 35తో సీఎం జగన్ చిత్రపరిశ్రమకు బుల్లెట్ దింపారు- మాజీ మంత్రి జవహర్

Ks Jawahar

KS Jawahar : ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి కేఎస్ జవహర్ మండిపడ్డారు. జీవో నెం 35తో సీఎం జగన్ చిత్ర పరిశ్రమకు బుల్లెట్ దింపారని అన్నారు. సినిమా హాళ్ల నిర్వహణలోని వ్యయ ప్రయాసలు, వాటిపై బతికేవారి గురించి జగన్ ఆలోచించడం లేదన్నారు. సినిమా హాళ్లను మూయిస్తున్న జగన్, పరోక్షంగా వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని వాపోయారు. చెత్త సలహాదారులను పక్కన పెట్టుకుని చెత్త నిర్ణయాలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. సినీ నటులు చిరంజీవి, నాగార్జున.. జగన్ నిర్ణయాన్ని ఎందుకు ప్రశ్నించరని జవహర్ అడిగారు. సినీ రంగం ఆదాయాన్ని కాజేయడానికే జగన్ కన్ను దానిపై పడిందన్నారు మాజీ మంత్రి జవహర్.

Lemon Juice : గ్యాస్ సమస్య ఉంటే తేనె, నిమ్మరసం కలిపి తీసుకోకూడదా?

రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో 35 తీసుకొచ్చింది. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్నింటికీ ఒకే ధరను నిర్ణయిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో వివాదాస్పదంగా మారింది. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ జోవోని వ్యతిరేకిస్తోంది. కాగా, జీవోని సవాల్ చేస్తూ పలు థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. కొత్త సినిమాలు విడుదలైన సమయంలో టికెట్ రేట్లు పెంచుకునే అధికారం థియేటర్ యజమానులకు ఉంటుందని వారి తరఫు న్యాయవాదులు తెలిపారు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఈ క్రమంలోనే హైకోర్టు.. టికెట్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35ను రద్దు చేసింది.

Fat : మనం తిన్న ఆహారం కొవ్వుగా ఎలా మారుతుందంటే?

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం టికెట్ రేట్లను తగ్గించడంతో సినిమా థియేటర్లు నడపడం తమ వల్ల కాదని యజమానులు వాటిని స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు. కరోనా వైరస్ నుంచి బయటపడే తరుణంలో ప్రభుత్వం టికెట్ల ధరలు తగ్గించడంతో ఆర్థిక భారాన్ని మోయలేక థియేటర్లను మూసివేస్తున్నారు.