Vatti Vasanth Kumar: మాజీ మంత్రి వ‌ట్టి వసంత్ కుమార్ క‌న్నుమూత‌

అనారోగ్యంతో మాజీ మంత్రి వ‌ట్టి వసంత్ కుమార్ క‌న్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయ‌న విశాఖ‌లోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప‌రిస్థితి విష‌మించి క‌న్నుమూశార‌ని వైద్య‌లు చెప్పారు. వ‌సంత్ కుమార్ స్వస్థలం పశ్చిమ గోదావ‌రి జిల్లా పూళ్ల గ్రామం.

Vatti Vasanth Kumar: మాజీ మంత్రి వ‌ట్టి వసంత్ కుమార్ క‌న్నుమూత‌

Vatti Vasanth Kumar

Vatti Vasanth Kumar: అనారోగ్యంతో మాజీ మంత్రి వ‌ట్టి వసంత్ కుమార్ క‌న్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయ‌న విశాఖ‌లోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప‌రిస్థితి విష‌మించి క‌న్నుమూశార‌ని వైద్య‌లు చెప్పారు.
వ‌సంత్ కుమార్ స్వస్థలం పశ్చిమ గోదావ‌రి జిల్లా పూళ్ల గ్రామం.

అభిమానుల సంద‌ర్శ‌నార్థం వ‌ట్టి వసంత్ కుమార్ భౌతిక‌కాయాన్ని ఎంఎంపురం గ్రామానికి త‌ర‌లించ‌నున్నారు. కాగా, ఆయ‌న ఉంగుటూరు నుంచి శాసనసభ సభ్యుడిగా 2004, 2009లో ఎన్నిక‌య్యారు. వైఎస్సార్ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఆ త‌ర్వాత రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి కేబినెట్‌లోనూ కొన‌సాగారు. వ‌ట్టి వసంత్ కుమార్ 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఓ సారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో ఆయ‌న స‌మావేశం అయ్యారు. జ‌న‌సేన పార్టీలో చేరుతున్నట్లు అప్ప‌ట్లో వార్తలు వ‌చ్చాయి.

అయితే, ఆ ప్ర‌చారాన్ని వ‌ట్టి వసంత కుమార్ ఖండించారు. తాను ప‌వ‌న్ ను మర్యాద పూర్వకంగానే కలిశానని అన్నారు.
కాగా,  వట్టి వసంత్ కుమార్ మృతి ప‌ట్ల ప‌లువురు రాజకీయ నాయ‌కులు సంతాపం తెలిపారు. ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు చెప్పారు. విశాఖ‌లోని అపోలో ఆసుప‌త్రి వ‌ద్ద‌కు వ‌ట్టి వసంత్ కుమార్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

Young Man Suicide : పోలీస్ స్టేషన్ ఎదుట తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం.. కొడుకు మృతి