5సార్లు ఎమ్మెల్యే, ఓసారి మంత్రి… అయినా సామాన్యుడిలా… హ్యాట్సాఫ్ సార్..

కార్పొరేటర్ లేదా కౌన్సిలర్‌గా ఎన్నికైన వాళ్లు కూడా డాబు దర్పం ప్రదర్శిస్తున్న రోజులివి. ఇక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి పొందితే చెప్పక్కర్లేదు. అదీ ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే చాలు.. తెగ బిల్డప్ ఇచ్చేస్తారు. దేశానికి ప్రధాని లెవల్ లో ఫీల్ అయిపోతారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి ఓడినా...ఇక జీవితాంతం ఆ హోదాని వాడతారు. పరపతి, పలుకుబడి వినిగియోంచుకుంటారు. ఎక్స్ ఎమ్మెల్యే అని స్టిక్కర్ వేసుకుని తిరుగుతారు.

5సార్లు ఎమ్మెల్యే, ఓసారి మంత్రి… అయినా సామాన్యుడిలా… హ్యాట్సాఫ్ సార్..

Ex Mla Visits Temple In Queline As A Common Man

Ex MLA Reddy Satyanarayana : కార్పొరేటర్ లేదా కౌన్సిలర్‌గా ఎన్నికైన వాళ్లు కూడా డాబు దర్పం ప్రదర్శిస్తున్న రోజులివి. ఇక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి పొందితే చెప్పక్కర్లేదు. అదీ ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే చాలు.. తెగ బిల్డప్ ఇచ్చేస్తారు. దేశానికి ప్రధాని లెవల్ లో ఫీల్ అయిపోతారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి ఓడినా…ఇక జీవితాంతం ఆ హోదాని వాడతారు. పరపతి, పలుకుబడి వినిగియోంచుకుంటారు. ఎక్స్ ఎమ్మెల్యే అని స్టిక్కర్ వేసుకుని తిరుగుతారు. ఖరీదైన ఖద్దర్ బట్టలే ధరిస్తారు. కాస్ట్లీ వాహనాల్లోనే తిరుగుతారు. చుట్టూ మందీ మార్బలం పెట్టుకుంటారు. తెగ హడావుడి చేస్తారు. అలాంటి రాజకీయనేతలున్న ఈ రోజుల్లో… ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినా సాదాసీదా జీవనం గడిపే మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారంటే నమ్ముతారా. అవును, ఉన్నారు.

ఆయన పేరు రెడ్డి సత్యనారాయణ. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునిగా వేలాదిమంది సాధారణ భక్తులకు తిరుమలేశుని దర్శనం కల్పించారు. అలాంటి వ్యక్తి… సాధారణ భక్తుడిగా క్యూలైన్ లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విశాఖలోని వడ్డాది వెంకటేశ్వర స్వామి ఉత్సవాల్లో ఈ దృశ్యం కనిపించింది.

ఐదుసార్లు ఎమ్మెల్యే, ఓసారి మంత్రిగా పనిచేసిన సత్యనారాయణకు వడ్డాదిలో ఎంతోమంది స్నేహితులు, అనుచరులు ఉన్నారు. అయినా, వారెవరికీ సమాచారం ఇవ్వకుండా ఆర్టీసీ బస్సులో వచ్చారు. ఓ యువకుడి బైక్ పై కొండపైకి వెళ్లారు. భక్తులతో రద్దీగా ఉన్నప్పటికీ ఆయన ఎక్కడా తన పలుకుబడి ఉపయోగించలేదు. నేను మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అని చెప్పుకోలేదు. ఓ సాధారణ భక్తుడిలా క్యూలైన్ లో వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. అసలు ఆయన వేషధారణ చూస్తే ఆయన మాజీ మంత్రిగా పని చేశారంటే ఎవరూ నమ్మరేమో. అంత సింపుల్ గా ఉంటారాయన.

ఇదిలా ఉంటే గతంలో సీఎం జగన్ ను కలిసేందుకు వెళ్ళగా అక్కడున్న సెక్యూరిటీ సత్యనారాయణను గుర్తించలేక పోయారట. నేను మాజీ మంత్రిగా పని చేశానని చెప్పినా వినిపించుకోలేదట. సామాన్యుడిగా ఉన్న ఆహార్యాన్ని చూసి వారికి నమ్మకం కుదరలేదు. అంతలో ఓ రాజకీయ నాయకుడు ఆయన్ను గుర్తిస్తే గాని అక్కడ సెక్యూరిటీకి బోధపడలేదట. వచ్చింది నిజంగానే మాజీ మంత్రి అని. అదీ రెడ్డి సత్యనారాయణ ప్రత్యేకత. నాటి తరం రాజకీయ నాయకుల్లో అతి సాధారణ జీవితం గడుపుతున్న ఈ మాజీ మంత్రి నేతి తరం రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.