ప్రాణాలు కాపాడిన ఫేస్‌బుక్ మిత్రులు..

సోషల్ మీడియా మంచికి వాడుకుంటే మంచే జరుగుతుంది అనడంలో సందేహం లేదు.. ఇటీవలికాలంలో ఫేస్‌బుక్ స్నేహాలు మోసాలు చెయ్యడానికే ఎక్కువ అవుతోన్న తరుణంలో.. ‘ఫేస్‌బుక్‌’ స్నేహం ఓ ప్రాణాన్ని కాపాడింది.

ప్రాణాలు కాపాడిన ఫేస్‌బుక్ మిత్రులు..

Facebook

సోషల్ మీడియా మంచికి వాడుకుంటే మంచే జరుగుతుంది అనడంలో సందేహం లేదు.. ఇటీవలికాలంలో ఫేస్‌బుక్ స్నేహాలు మోసాలు చెయ్యడానికే ఎక్కువ అవుతోన్న తరుణంలో.. ‘ఫేస్‌బుక్‌’ స్నేహం ఓ ప్రాణాన్ని కాపాడింది. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుని చివరిసారిగా ఫేస్‌బుక్‌లో స్నేహితులకు మెసేజ్ పెట్టారు.

తర్వాత రైలు పట్టాలపై పడుకుని చనిపోయే వ్యక్తిని కాపాడగలిగారు పోలీసులు.. పదిహేనేళ్లుగా కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోని వివిధ హోటళ్లలో పనిచేస్తున్న సతీష్‌ అనే యువకుడు ‘లాక్‌డౌన్‌’ దెబ్బకు పనుల్లేక తన స్వస్థలమైన అనంతపురం వెళ్లిపోయారు.

కొంతకాలంగా ‘ఫేస్‌బుక్‌’లో మిత్రులతో మాట్లాడుతూనే ఉండగా.. జీవితంపై విరక్తితో లోకం నుంచి సెలవు తీసుకోవాలని చనిపోయేందుకు నిర్ణయించుకుని శనివారం మధ్యాహ్నం తన స్నేహితులకు మెసేజ్ పంపించారు.

ఫేస్‌బుక్ మిత్రులు ఎన్నిసార్లు ఫోన్‌చేసినా సతీష్ స్పందించకపోవడంతో అన్నపూర్ణ సేవాసమితి వ్యవస్థాపకుడు మహంకాళి ప్రకాష్‌ చొరవచూపి, పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మాజీ ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య సైతం సతీష్‌ నివసించే అనంతపురం పోలీసులకు విషయాన్ని తెలియజేశారు.

వెంటనే స్పందించిన పోలీసులు.. టెక్నికల్ ఇన్‌ఫర్మేషన్ ద్వారా అనంతపురానికి 10 కి.మీ.ల దూరంలో నుంచి సతీష్ మెసేజ్ పంపినట్లుగా, ఆ ప్రాంతాన్ని గుర్తించి, అక్కడికి పోలీసులను పంపారు. సతీష్‌ రైలు పట్టాలపై పడుకొని కనిపించగా.. రైలు మరో 7 నిమిషాలకు రావాల్సి ఉండగా.. ఆయన్ను కాపాడారు.