AP DGP Twitter: డీజీపీ ఫోటోతో ఫేక్ అకౌంట్.. ట్విట్టర్‌పై ఏపీ సర్కార్ సీరియస్!

ఏపీ డీజీపీ నకిలీ అకౌంట్ సమాచారం ఇచ్చేందుకు ట్విట్టర్ నిరాకరించింది. ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు ఇవ్వలేమని ట్విట్టర్ యాజమాన్యం రిప్లై ఇచ్చింది. ట్విట్టర్ కు మూడు సార్లు మెయిల్ పంపించినా..స్పందించలేదని తెలుస్తోంది.

AP DGP Twitter: డీజీపీ ఫోటోతో ఫేక్ అకౌంట్.. ట్విట్టర్‌పై ఏపీ సర్కార్ సీరియస్!

Ap Dgp

Fake Twitter AP DGP : ఏపీ డీజీపీ నకిలీ అకౌంట్ సమాచారం ఇచ్చేందుకు ట్విట్టర్ నిరాకరించింది. ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు ఇవ్వలేమని ట్విట్టర్ యాజమాన్యం రిప్లై ఇచ్చింది. ట్విట్టర్ కు మూడు సార్లు మెయిల్ పంపించినా..స్పందించలేదని తెలుస్తోంది. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఫొటోతో ట్విట్టర్ లో మూడు నకిలీ ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. మెయిల్ పంపడంతో వాటిని ట్విట్టర్ తొలగించింది. అయితే..ఐపీ అడ్రస్, ఇతర వివరాలు ఇచ్చేందుకు ట్విట్టర్ నిరాకరించింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పేరిట ట్విట్టర్ లో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఖాతాలను తెరిచారు. గౌతమ్ సవాంగ్ ఫొటోను కూడా అందులో పోస్టు చేయడంతో పోలీసు శాఖ అలర్ట్ అయ్యింది. ఈ వ్యవహారంపై విజయవాడ సైబర్ క్రైం స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఎవరు నకిలీ అకౌంట్ సృష్టించారు ? దీని వెనుక ఎవరున్నారు ? అనే దానిపై ఆరా తీశారు. అయితే..దీనికి సంబంధించి ఐపీ అడ్రస్ కీలకంగా మారింది. దీంతో ఐపీ అడ్రస్ ఇవ్వాల్సిందిగా ట్వీట్టర్ ను ఏపీ పోలీసు శాఖ కోరింది.

సమాచారం ఇవ్వడం కుదరదని, ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు ఇవ్వలేమని ట్విట్టర్ యాజమాన్యం సమాధానం ఇవ్వడంతో పోలీసులు షాక్ తిన్నారు. పలుమార్లు మెయిల్ పంపించినా ట్విట్టర్ రెస్పాండ్ కాలేదని సమాచారం. దీంతో కేంద్రం ఇటీవలే తెచ్చిన ఐటీ చట్టాలను ఏపీ పోలీసు శాఖ పరిశీలిస్తోంది. దర్యాప్తునకు సహకరించాలని కొత్త ఐటీ చట్టం చెబుతోంది. విజయవాడ పోలీసులు చేసిన విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంపై నోటీసులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.