రాజకీయాల్లో పవన్ ఓటమికి అభిమానులే కారణమా, ఫ్యాన్సే ఆయనకు మైనస్సా? విశ్లేషణ

  • Published By: naveen ,Published On : July 20, 2020 / 01:41 PM IST
రాజకీయాల్లో పవన్ ఓటమికి అభిమానులే కారణమా, ఫ్యాన్సే ఆయనకు మైనస్సా? విశ్లేషణ

సినిమాల్లో, ట్విట్టర్ లో విపరీతమైన ఫాలోయింగ్. రాజకీయాల్లోకి వచ్చారు. అభిమానగణం పెరిగింది. అదంతా చూసి ఏపీ రాజకీయాల్లో పెను ప్రభావం చూపిస్తారనే అంచనాలు. ఆయనంటే అభిమానులకు పిచ్చి. ఇంత ఉన్నా అదంతా సినిమాలకే పరిమితమా? అంత ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్.. రెండు చోట్ల ఓడిపోవడానికి అభిమానులే కారణమా? వారే ఆయనకు మైనస్ గా మారారా?

Pawan Kalyan fans vandalise Konda Reddy Fort

అభిమానులే ఓటమికి కారణం, స్వయంగా చెప్పిన పవన్:
పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌కు అభిమానులే బలం. ఆయన సైన్యం కూడా వారే. ఇప్పుడు జన సైనికులే పవన్‌కు మైనస్ అవుతున్నారన్న చర్చ సాగుతోంది. పవన్ ఓటమికి కారణం కూడా వారేనని టాక్‌ నడుస్తోంది. వారి అత్యుత్సాహమే జనసేనను ఇంత దాకా తెచ్చిందట. ఈ మాటలు స్వయంగా పవన్‌ కల్యాణే అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో 2019 డిసెంబర్‌లో జరిగిన రైతు సదస్సుకు పవన్ ఫ్యాన్స్ భారీగా హాజరయ్యారు. రైతుల సమస్యలపై ఎమోషనల్‌గా మాట్లాడుతున్న పవన్‌కు కార్యకర్తలు, అభిమానులు అడ్డు తగిలారు. ఈలలు వేస్తూ అత్యుత్సాహంతో పవన్‌ను మాట్లాడనీయలేదు. దీంతో సహనం కోల్పోయిన పవన్.. మీరిలా క్రమశిక్షణ లేకపోవడం వల్లే మనం ఓడిపోయాం.. క్రమశిక్షణ ఉండుంటే జనసేన గెలిచి ఉండేదంటూ అభిమానులపై ఫైర్ అయ్యారు.

Pawan Kalyan Thanks Twitter India For Restoring Twitter Accounts ...

అలా చేస్తే కనీసం 1.60 కోట్ల మంది జనసేనకు ఓటేసేవారు:
నిజానికి పవన్‌కు ట్విట్టర్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాదాపు 40లక్షల మంది అభిమానులున్నారు. వారంతా కనీసం తమ కుటుంబంలోని నలుగురికి జనసేన లక్ష్యాలు, ఆకాంక్షలు చెప్పి.. పవన్ విశ్వసనీయతను విడమరిచి ఉంటే ఏపీ ఎన్నికల్లో జనసేన నిలబడేదని అంటున్నారు. మెజార్టీ ఓట్లు సాధించేదనే అభిప్రాయం ఉంది. ఇలా చేస్తే కనీసం 1.60 కోట్ల మంది జనసేనకు ఓటేసేవారని లెక్కలేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని కూడా ఘోరంగా ఓడిపోయే వారు కాదు. స్టార్‌ ఇమేజ్‌ ఉన్న ఆయన రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయారంటే ఫ్యాన్స్ కూడా సరిగా ఓటేయలేదనే అర్థమంటున్నారు. పవన్‌ను పిచ్చిగా అభిమానించే ఫ్యాన్స్‌… ఆయన తరఫున క్యాంపెయిన్ చేయడంలో మాత్రం ఆశించిన మేరకు ముందుకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Pawan Kalyan show of strength in Kapu heartland- The New Indian ...

సోషల్ మీడియాలో సూపర్ ఫాలోయింగ్, పాలిటిక్స్ లో నిల్:
సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉన్న పవన్ కల్యాణ్‌కు పాలిటిక్స్‌లో మాత్రం ఆ స్థాయిలో వారంతా ఫాలో అవ్వడం లేదంటున్నారు. పవన్‌ ఫ్యాన్స్‌ కారణంగా సోషల్‌ మీడియాలో పవన్‌ను వ్యతిరేకించేవారి నుంచి విపరీతంగా ట్రోలింగ్స్‌, కామెంట్స్‌ వస్తున్నాయి. పవన్‌ను ఉద్దేశించి దారుణంగా కామెంట్స్‌ చేసేవారు చాలా మందే ఉన్నారు. దీనంతటికీ కారణం ఆయన ఫ్యాన్స్‌ వ్యవహరించే తీరేనని అంటున్నారు. పవన్‌ బర్త్ డేకు రెండు నెలల ముందే ట్విట్టర్‌లో ట్రెండింగ్ సృష్టిస్తూ ఏకంగా 270 లక్షల ట్వీట్లు చేశారు. ట్విట్టర్‌లోనే ఇదో సంచలన రికార్డ్. కానీ, రాజకీయాల్లో మాత్రం పవన్‌ను ఆ స్థాయిలో ఆదరించడం లేదనే చెప్పాలి. ఇదే స్థాయి పట్టుదల ఆయన ఫ్యాన్స్ ఏపీ ఎన్నికల్లో చూపిస్తే కనుక నిజంగానే పవన్ రాజకీయంగా ఎంత ఎత్తులో ఉండేవారని అంటున్నారు. కానీ ఆ ఫ్యాన్స్ బలమే బలహీనతగా మారి పవన్ రాజకీయాల్లో దెబ్బతిన్నారని భావిస్తున్నారు.