కన్న కొడుకులనే కాడెద్దులుగా మార్చిన రైతు.. ఎందుకో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు

కాడెద్దులను రైతులు సొంత పిల్లల్లా చూసుకుంటారు. వాటికి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. విలవిలలాడుతారు. ఆ రైతు కూడా అంతే. తన కాడెద్దులు అంతే ఆయనకు ఎంతో ప్రేమ. అయితే ఓ ఎద్దుకి అనారోగ్యం చేసింది. బండి లాగలేకపోయింది. అంతే..

కన్న కొడుకులనే కాడెద్దులుగా మార్చిన రైతు.. ఎందుకో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు

Farmer Ox

Farmer Ox : కాడెద్దులను రైతులు సొంత పిల్లల్లా చూసుకుంటారు. వాటికి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. విలవిలలాడుతారు. ఆ రైతు కూడా అంతే. తన కాడెద్దులు అంతే ఆయనకు ఎంతో ప్రేమ. అయితే ఓ ఎద్దుకి అనారోగ్యం చేసింది. బండి లాగలేకపోయింది. అంతే.. ఆ ఎద్దుని పక్కకి తప్పించి, తన కొడుకులనే కాడెద్దులుగా మార్చేశాడు. అలా మూగజీవిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. కర్నూలు జిల్లాలో ఈ ఘటన జరిగింది.

జిల్లపాడుకు చెందిన రాముడు రైతు. వ్యవసాయమే జీవనాధారం. ఆయనకు రెండు కాడెద్దులు ఉన్నాయి. అన్ని పనులూ వాటితోనే చేయిస్తాడు. కాగా, గ్రామంలో వ్యవసాయ పనులు లేకపోవడంతో ఎద్దుల బండిపై ఇసుక తరలించే పని ఒప్పుకున్నాడు. రోజూలాగే శుక్రవారం(ఏప్రిల్ 9,2021) కూడా ఎద్దుల బండిలో నందికొట్కూరుకు ఇసుకను తరలించాడు. తిరిగి ఇంటికి పయనం అయ్యాడు. దారిలో ఓ ఎద్దు ఆరోగ్యం క్షీణించింది. ఉన్నచోటే ఉండిపోయింది. బండి లాగలేక ఆగిపోయింది.

ఆ ఎద్దు పడుతున్న బాధను అర్థం చేసుకున్న రైతు.. వెంటనే ఎద్దులను పక్కకి తప్పించాడు. ఇంటి దగ్గరున్న తన కొడుకులను పిలిపించాడు. వారిని కాడెద్దులుగా మార్చి బండిని లాగించాడు. తాను ఎద్దులను తోలుకుని ఇంటికి వెళ్లాడు. అల్లూరు రహదారిలో ఈ దృశ్యం కనిపించింది. మూగజీవాలపై ఆ అన్నదాత చూపిన ప్రేమకు అంతా ఫిదా అవుతున్నారు. ఈ రోజుల్లో సాటి మనిషిని కూడా గౌరవించడం లేదు. అలాంటిది నోరు లేని మూగజీవిపై అపారమైన ప్రేమ కలిగి ఉండటం నిజంగా గ్రేటే అని అంతా అంటున్నారు. ఆ రైతు మనసు చాలా పెద్దది, గొప్పది అని పొగుడుతున్నారు.