మనవడి కోసం కోడలిపై కన్నేసిన మామ

  • Published By: murthy ,Published On : September 29, 2020 / 01:37 PM IST
మనవడి కోసం కోడలిపై కన్నేసిన మామ

అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవ చ నైవ చ ।
తస్మాత్ పుత్రముఖం దృష్ట్వా పశ్చాద్భవతి తాపసః

father in law Sexual harassment on son”s wife : పుత్రులు లేనివానికి గతి లేదు. స్వర్గం అసలే లేదు. అందువలన పుత్రుని ముఖం చూచిన తరవాతనే తపస్సు చేసుకోవడం కోసం వెళ్ళాలి అని పెద్దలు సూక్తి చెపుతుంటారు…….. కానీ గుంటూరు జిల్లాలో ఒక మామ వారసుడి కోసం కోడలిపై కన్నేశాడు.

తల కొరివి పెట్టి సాగనంపటానికి కొడుకు ఉన్నాడు, కానీ తన కొడుకు తర్వాత వంశాభివృధ్ది కోసం మనవడు కావాలని కోరుకున్నాడు. కొడలికి రెండు సార్లు ఆడపిల్లలు పుట్టే సరికి ఎప్పటికైనా వంశాన్ని ఉద్దరించటానికి మనవడు కావాలనే కోరికతో మృగాడయ్యాడు. దీంతో బాధితురాలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సెప్టెంబర్ 28 సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో తన గోడు వెళ్లబోసుకుంది.


గుంటూరులోని ఒక వస్త్ర దుకాణంలో పని చేసే యువతి అక్కడే పని చేస్తున్న యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ పెద్దల అంగీకారంతో 2016లో పెళ్లి చేసుకుని ఒకింటివారయ్యారు. కాలక్రమంలో వారికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. రెండో సారి ఆడపిల్ల పుట్టేసరికి భర్త అసంతృప్తికి గురయ్యాడు.

మగపిల్లాడు పుట్టలేదని భార్యను వేధించటం మొదలెట్టాడు. భర్త మగపిల్లాడి కోసం వేధిస్తున్నాడని మామగారికి చెప్పగా ….మాకు వారసుడు కావాలి . నువ్వు నాతో ఉండు… అన్నీ నేను చూసుకుంటా అంటూ కోడలిని కామదృష్టితో చూడటం మొదలెట్టాడు.


అప్పటి నుంచి అవకాశం చిక్కినప్పుడల్లా కోడలిపై లైంగికంగా వేధించటం మొదలెట్టాడు. నీకు కూతురు లాంటి దాన్ని ఇలా చేయటం భావ్యం కాదని వేడుకున్నా ఇవన్నీ మామూలే…సర్దుకుపో అంటూ కోడలిపై చొరవతీసుకోబోయాడు. భర్త, మామ ల వేధింపులు భరించలేని ఆ ఇల్లాలు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి చేరింది.

మనవరాళ్లను చూడాలనే సాకుతో మామ వియ్యాల వారింటికి వచ్చాడు. అక్కడ ఇంట్లో ఎవరూలేని సమయం చూసి మళ్లీ కోడలిపై అత్యాచారం చేయబోయాడు. భయంతో కోడలు ఇంట్లోనుంచి బయటకు వచ్చేసింది. ఈవిషయాన్ని అత్తగారికి చెప్పగా ఈ రోజుల్లో ఇవన్నీ మాములే సర్దుకుపో అని మామను వెనుకేసుకు వచ్చింది.


దీంతో ఎవరినీ ఎదిరించే శక్తిలేని ఆఇల్లాలు. ఇంట్లో ఉండే ధైర్యం చాలక సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయం లో జరిగే స్పందన కార్యక్రమానికి హాజరయ్యింది. భర్త, అత్త మామల నుంచి రక్షించాలని వేడుకుంటూ తనకన్నీటి గాధను ఏఎస్పీకి వివరించింది. వెంటనే స్పందించిన ఏఎస్పీ గంగాధరం కేసువిచారించి బాధితురాలికి న్యాయం చేయాలని సంబంధిత పోలీసుస్టేషన్ ఎస్సైను ఆదేశించారు.