Female Constable Suicide : తోటి ఉద్యోగి లైంగిక వేధింపులు.. చెరువులో దూకి మహిళా కానిస్టేబుల్ సూసైడ్

రెండు రోజుల క్రితం లేపాక్షి చెరువులో సావత్రి మహిళా కానిస్టేబుల్ మృతదేహం బయటపడింది. అయితే తోటి ఉద్యోగి లైంగిక వేధింపులే తన మృతికి కారణమంటూ సావత్రి సూసైడ్ నోట్ రాసింది.

Female Constable Suicide : తోటి ఉద్యోగి లైంగిక వేధింపులు.. చెరువులో దూకి మహిళా కానిస్టేబుల్ సూసైడ్

Suicide (1)

co-employee sexual harassment : సాధారణంగా ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపుల వంటి సమస్యలు ఎదురైతే ఫిర్యాదు చేసేందుకు మహిళలు పోలీసులను ఆశ్రయిస్తారు. కానీ ఓ మహిళా కానిస్టుబుల్ కే లైంగిక వేధింపుల ఘటన ఎదురైంది. తోటి ఉద్యోగే.. మహిళా కానిస్టేబుల్ ను లైంగిక వేధింపులకు గురి చేశాడు. వేధింపులు భరించలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని చినమత్తూరు మండలం దేమకేతుపల్లి గ్రామ సచివాలయంలో సావత్రి అనే మహిళ కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. అయితే తోటి ఉద్యోగి ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. దీంతో మహిళా కానిస్టేబుల్ సావిత్రి చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

Election Schedule : మధ్యాహ్నం 3.30 గంటలకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

రెండు రోజుల క్రితం లేపాక్షి చెరువులో సావత్రి మహిళా కానిస్టేబుల్ మృతదేహం బయటపడింది. అయితే తోటి ఉద్యోగి లైంగిక వేధింపులే తన మృతికి కారణమంటూ సావత్రి సూసైడ్ నోట్ రాసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే గ్రామ సచివాలయంలో పని చేసే ఉద్యోగికే భద్రత కరువైందంటూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతనే ఇది ఎలా జరిగిందన్న కొలిక్కి వస్తుందని పోలీసులు చెబుతున్నారు. అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.