Panasaguda: మా ఊరికి ఎవరూ రావొద్దు..

కరోనా మహమ్మారి వేళ చాలా ఊర్లలో కనిపించిన సందేశం ఇది. 'మా ఊరికి ఎవరూ రావొద్దు..' అంటూ ఊర్లకు ఊర్లు బోర్డులు పెట్టేసుకున్నాయి.

Panasaguda: మా ఊరికి ఎవరూ రావొద్దు..

Panasaguda

Panasaguda: కరోనా మహమ్మారి వేళ చాలా ఊర్లలో కనిపించిన సందేశం ఇది. ‘మా ఊరికి ఎవరూ రావొద్దు..’ అంటూ ఊర్లకు ఊర్లు బోర్డులు పెట్టేసుకున్నాయి. తర్వాతి కాలంలో అవగాహన కారణంగా పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం హడ్డుబంగి పంచాయతీ పనసగూడలో మరోసారి ఊరి పొలిమేరల్లో ఇటువంటి బోర్డే కనిపిస్తుంది.

నాలుగు రోజులు ఎవరూ మా ఊరికి రావొద్దు.. ఊరి నుంచి కూడా ఎవరూ బయటకు వెళ్లొద్దు’ అంటూ గ్రామస్తులు రోడ్డుపై ఏకంగా కంచె వేసేశారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం హడ్డుబంగి పంచాయతీ పనసగూడలో ఈ పరిస్థితి చోటుచేసుకుంది.

 ఫిబ్రవరిలో కరోనా తీవ్రత అధికంగా ఉంటుంది – శ్రీనివాసరావు

అయితే, ఇందుకు కారణం ఏమిటంటే, ఇటీవల గ్రామంలో విష జ్వరాలు బాగా సోకాయని, పంటలు పండట్లేదని, ఇందుకు పరిష్కారంగా గ్రామంలో హిజ్రాలతో ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో ఇలాంటి ముఢనమ్మకాలా అంటూ పలువురు విస్తుపోతున్నారు.

మిస్టర్ తెలంగాణ-2021 బాడీ బిల్డింగ్ పోటీలు