విజయవాడ బెంజి సర్కిల్‌లో భారీ అగ్నిప్రమాదం, రిలయన్స్ ట్రెండ్స్‌లో మంటలు

విజయవాడ బెంజి సర్కిల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రిలయన్స్ ట్రెండ్స్ షోరూమ్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు

  • Published By: naveen ,Published On : June 11, 2020 / 07:59 AM IST
విజయవాడ బెంజి సర్కిల్‌లో భారీ అగ్నిప్రమాదం, రిలయన్స్ ట్రెండ్స్‌లో మంటలు

విజయవాడ బెంజి సర్కిల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రిలయన్స్ ట్రెండ్స్ షోరూమ్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు

విజయవాడ బెంజి సర్కిల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రిలయన్స్ ట్రెండ్స్ షోరూమ్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టంగా పొగలు అలుముకోవడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 7 ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. 70మంది సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. చెప్పుల గోడౌన్ లో అగ్నిప్రమాదం సంభవించినట్టు గుర్తించారు. దట్టమైన పొగ కారణంగా లోపలికి వెళ్లేందుకు అగ్నిమాపక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేక పరికారాలు, బ్రీత్ ఎనలైజర్ సాయంతో అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్లి మంటలను అదుపు చేస్తున్నారు. కాగా, సహాయ కార్యక్రమాల్లో అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. గురువారం(జూన్ 11,2020) ఉదయం 8.45కి అగ్నిప్రమాదం జరిగింది. వాల్స్ బ్రేక్ చేసి మంటలు అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

Read: పిచ్చివాడిగా ముద్ర వేసి చంపాలనుకున్నారు, పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైన డాక్టర్ సుధాకర్