Fishing Banned : విశాఖ జిల్లా మత్స్యకార గ్రామాల్లో వలల వివాదం..సముద్రంలో చేపల వేట నిషేధం

విశాఖ జిల్లాలోని మత్స్యకార గ్రామాల్లో వలల వివాదంపై అధికారుల సీరియస్ అయ్యారు. పెదజాలరిపేట, కొత్త జాలరిపేట, జాలరిఎండాడ, వాశవానిపాలెం, మూలపాలెం గ్రామాల మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చేపల వేటకు వెళ్లిన వారిని వెంటనే వెనక్కి రప్పించాలని గ్రామ పెద్దలకు ఆదేశించారు. రింగు వల, సంప్రదాయ వల మత్స్యకారుల వివాదాలు రోజురోజుకూ పెరుగుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Fishing Banned : విశాఖ జిల్లా మత్స్యకార గ్రామాల్లో వలల వివాదం..సముద్రంలో చేపల వేట నిషేధం

Fishing banned : విశాఖ జిల్లాలోని మత్స్యకార గ్రామాల్లో వలల వివాదంపై అధికారుల సీరియస్ అయ్యారు. పెదజాలరిపేట, కొత్త జాలరిపేట, జాలరిఎండాడ, వాశవానిపాలెం, మూలపాలెం గ్రామాల మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చేపల వేటకు వెళ్లిన వారిని వెంటనే వెనక్కి రప్పించాలని గ్రామ పెద్దలకు ఆదేశించారు. రింగు వల, సంప్రదాయ వల మత్స్యకారుల వివాదాలు రోజురోజుకూ పెరుగుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

గొడవలతో గ్రామాల్లో శాంతిభద్రతలు లోపించడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రింగువలలతో చేపలు పట్టవద్దని సాంప్రదాయ మత్స్యకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో కొన్నాళ్లుగా ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ కొనసాగుతూనే ఉంది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడంతో పాటు బోట్లను తగలబెట్టుకునే వరకు వెళ్లింది. ఈ వివాదం అటు అధికారులు.. మంత్రుల వరకూ వెళ్లింది. ఎవరెన్ని చెప్పినా.. వివాదం మళ్లీ మొదటికే వస్తుండటంతో ఈసారి అధికారులు సీరియస్‌ యాక్షన్‌ తీసుకున్నారు.

Ringuvala Dispute : విశాఖలో మళ్లీ సంప్రదాయ-రింగువల మత్స్యకారుల మధ్య గొడవ

సముద్రంలో తాత్కాలికంగా చేపల వేటపై నిషేదం విధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఐదు గ్రామాల మత్స్యకారులు ఎవరైనా ఆదేశాలు ఉల్లంఘిస్తే.. చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు చేపల వేటకు వెళ్లకూడదని విశాఖ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.