Road Accident In Prakasam District: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఐదుగురు మృతి

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. వీరంతా పల్నాడు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

Road Accident In Prakasam District: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఐదుగురు మృతి
ad

Road Accident In Prakasam District: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారు జామున మాచర్ల నుంచి తిరుపతి వెళ్తున్న కారు కంభం సమీపంలోకి రాగానే లారీని వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు.

Road Accdient in Prakasam District (1)

Road Accdient in Prakasam District

మృతుల్లో గురువమ్మ (60), అనిమిరెడ్డి(60), అనంతమ్మ (55), ఆదిలక్ష్మి (58), నాగిరెడ్డి (24)లు ఉన్నారు. వీరంతా పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిపాడు వాసులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కంభం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Road Accdient in Prakasam District (2)

Road Accdient in Prakasam District

ప్రమాద ఘటనతో సిరిగిపాడు గ్రామంలో విషాదం నెలకొంది. ఇదిలాఉంటే పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నారు.