Amaravati Farmers Maha Padayatra : అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత.. ఫేక్ రైతులు, ఫేక్ యాత్రికులు గోబ్యాక్ అంటూ బ్యానర్లు

మూడు రాజధానులకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఈ యాత్రకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైసీపీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రైతులది ఫేక్ పాదయాత్ర అని, కొందరి స్వార్థ ప్రయోజనాల కోసమే యాత్ర చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేతలు.

Amaravati Farmers Maha Padayatra : అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత.. ఫేక్ రైతులు, ఫేక్ యాత్రికులు గోబ్యాక్ అంటూ బ్యానర్లు

Amaravati Farmers Maha Padayatra : అమరావతి రాజధాని రైతుల పాదయాత్రలో ఎక్కడో ఒక చోట రగడ కొనసాగుతూనే ఉంది. పాదయాత్రను వ్యతిరేకిస్తున్న అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు.. యాత్రను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఈ యాత్రకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైసీపీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పాదయాత్రకు వ్యతిరేకంగా నల్ల బెలూన్లు ఎగరేసి నిరసన తెలిపారు. రైతులది ఫేక్ పాదయాత్ర అని, కొందరి స్వార్థ ప్రయోజనాల కోసమే యాత్ర చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేతలు. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తల నడుమ హైటెన్షన్ నెలకొంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

పాదయాత్రకు వ్యతిరేకంగా తాడేపల్లిగూడెంలో పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. ఫేక్ రైతులు, ఫేక్ యాత్రికులు గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం జగన్, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఫోటోలతో ఈ ఫ్లెక్సీలు వైసీపీ కార్యకర్తలు ఏర్పాటు చేశారు.

వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై రైతులు, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం చేస్తున్న యాత్రను ఫేక్ యాత్ర అని ఎలా అంటారని అధికార పార్టీ నేతలను నిలదీశారు. వైసీపీ ప్రభుత్వమే రాజధాని విషయంలో ఫేక్ హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చిందని ఫైర్ అయ్యారు అమరావతి రైతులు.

అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా మంత్రి కొట్టు సత్యనారాయణ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించడంపై టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఫైర్ అయ్యారు. మంత్రి కొట్టు సత్యనారాయణకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రైతుల పాదయాత్ర ఫేకో నిజమో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. మంత్రి కొట్టు సత్యనారాయణ నిజమైన మంత్రా? ఫేక్ మంత్రా? అనేది ప్రజలకు తెలుసన్నారు. ఇక మంత్రికి దమ్ముంటే.. రైతుల పాదయాత్రలో పాల్గొన్న ప్రజలకంటే ఎక్కువమంది ప్రజలను పోగేసి తాడేపల్లిగూడెం ఫ్లైఓవర్ పై నిరసన తెలపాలని సవాల్ విసిరారు చింతమనేని ప్రభాకర్. ఫ్లెక్సీలు కట్టించినంత మాత్రాన రైతుల పాదయాత్ర ఫేక్ కాదని తేల్చి చెప్పారు చింతమనేని ప్రభాకర్.