ఇలా చేస్తే కరోనా వైరస్ రాదు

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చాపకింద నీరులా ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. చైనాలో వెలుగు చూసిన కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది.

  • Published By: veegamteam ,Published On : March 17, 2020 / 05:48 AM IST
ఇలా చేస్తే కరోనా వైరస్ రాదు

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చాపకింద నీరులా ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. చైనాలో వెలుగు చూసిన కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది.

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చాపకింద నీరులా ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. చైనాలో వెలుగు చూసిన కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ప్రస్తుతం 160కు పైగా దేశాలకు కరోనా విస్తరించింది. లక్షల మంది కరోనా బారిన పడ్డారు. వేల మంది చనిపోయారు. వందల మంది పరిస్థితి సీరియస్ గా ఉంది. కరోనాను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. కరోనాను జాతీయ విపత్తుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇటలీ, ఇరాన్, సౌదీ అరేబియాలో కరోనా కోరలు చాస్తోంది. కరోనా కట్టడికి అన్ని దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటివరకు కరోనాకు మందు కానీ వ్యాక్సిన్ కానీ కనిపెట్టకపోవడం ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

కాగా కరోనా ప్రాణాంతక కాదని డాక్టర్లు అంటున్నారు. కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని చెబుతున్నారు. కరోనా గురించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మీ జాగ్రత్తే మీకు శ్రీరామ రక్ష అంటున్నారు. అవగాహనతోనే కరోనాను నియంత్రించ వచ్చని చెప్పారు. పరిశుభ్రతే కరోనా వైరస్ కు సరైన పరిష్కారం అని సూచించారు. చేతులు తరుచుగా శుభ్రంగా కడుక్కోవడం, చేతులతో ముఖాన్ని ముట్టుకోకపోవడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందన్నారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు రుమాలు అడ్డు పెట్టుకోవాలన్నారు. చుట్టు పక్కల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. కరోనా అనుమానితులకు దూరంగా ఉంటే బెస్ట్ అని డాక్టర్లు చెప్పారు.

* అవగాహనతోనే కరోనా నియంత్రణ
* పరిశుభ్రతే కరోనా వైరస్ కు సరైన పరిష్కారం
* చేతులను తరుచూ శుభ్రంగా కడుక్కోవాలి
* చేతులతో ముఖాన్ని ముట్టుకోవద్దు
* కళ్లు, ముక్కును చేతులతో నులుముకోవద్దు
* షేక్ హ్యాండ్ కు దూరంగా ఉంటే మంచిది
* కరోనా అనుమానితులకు దూరంగా ఉండాలి

* బాధితుడి నోటి తుంపర్ల ద్వారా వైరస్ సోకే ఛాన్స్
* మనుషులను తాకడం వల్ల కరోనా వచ్చే అవకాశం 
* తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు రుమాలు అడ్డు పెట్టుకోవాలి
* చుట్టుపక్కల ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి
* వ్యాధి లక్షణాలుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి

* 14 రోజుల్లో కరోనా నుంచి బయటపడే అవకాశం
* గ్లౌస్ లు, మాస్క్ ధరించడం మంచిది
* బహిరంగ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలి

కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 164 దేశాలకు స్ప్రెడ్ అయ్యింది. రోజు రోజుకి కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది. చైనాలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో ఇటలీ, ఇరాన్, స్పెయిన్ లో ఒక్కసారిగా కరోనా విజృంభించడం కలకలం రేపుతోంది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 2019 డిసెంబర్ లో చైనాలో వుహాన్ లో కరోనా వెలుగు చూసింది. ఇప్పటివరకు ఈ వైరస్ ను ఎదుర్కోకలిగే వ్యాక్సిన్ కానీ మందు కానీ కనిపెట్టలేకపోయారు.