కుళ్లిన మాంసం, పాచిన హల్వా.. విజయవాడ రెస్టారెంట్లలో అధికారుల తనిఖీల్లో బయటపడ్డ దారుణాలు

  • Published By: naveen ,Published On : November 3, 2020 / 03:55 PM IST
కుళ్లిన మాంసం, పాచిన హల్వా.. విజయవాడ రెస్టారెంట్లలో అధికారుల తనిఖీల్లో బయటపడ్డ దారుణాలు

checkings in vijayawada restaurants: విజయవాడలోని రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బార్బీ క్యూ నేషన్ రెస్టారెంట్ లో తనిఖీలు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించకుండానే రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్టు, ఆహారంలో నిషిద్ధ రంగులు వాడుతున్నట్టు అధికారులు గుర్తించారు.




నిల్వ ఉంచిన కుళ్లిన మాంసాన్ని, ఫంగస్ వచ్చిన హల్వాను సరఫరా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఆహార పదార్దాల నమూనాలను అధికారులు సేకరించారు. పరీక్షల నిమిత్తం నమూనాలను ల్యాబ్ కి పంపారు. 20 ప్యాకెట్ల పాచిపోయిన హల్వాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రెస్టారెంట్లలో కుళ్లిన మాంసం, పాచిన హల్వా వడ్డిస్తున్నారని కస్టమర్లు ఫిర్యాదులు చేశారు. కస్టమర్ల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టారు. వారి తనిఖీల్లో రెస్టారెంట్లలో జరుగుతున్న ఘోరం వెలుగులోకి వచ్చింది.