DL Ravindra Reddy: వైసీపీలో ఉన్నానంటే నాకే అసహ్యంగా ఉంది.. చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి

బైజూస్ పేరుతో ప్రభుత్వం 1400కోట్లు వృథా చేస్తుందని, బైజూస్‌తో ఒప్పందం కోసం ఇద్దరు కడప జిల్లా‌కు చెందిన వ్యక్తులు చక్రం తిప్పారని డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. టాలెంట్ ఉన్న ఉపాధ్యాయులను కాదని బైజూస్‌తో పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. బైజూస్ కోసం ఖర్చుచేస్తున్న 1400కోట్లలో కనీసం కొంతైన ఉపాధ్యాయులకు ఖర్చు చేయాలి. విద్యార్థులు విషయం‌లో ప్రభుత్వం అవినీతి మానుకోవాలి అని డీఎల్ అన్నారు.

DL Ravindra Reddy : వైసీపీలో ఉన్నానంటే నాకే అసహ్యంగా ఉంది. నా స్నేహితుడి కుమారుడు జగన్ ఇంత అవినీతి పరుడుగా మారుతాడని నేను ఊహించలేదు.. పరిపాలన మొదటి రోజు నుంచే సీఎం జగన్ అవినీతికి పాల్పడ్డాడు అంటూ.. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం కడపలో నిర్వహించిన మీడియాలో సమావేశంలో ఆయన మాట్లాడారు.. దివాలా అంచున ఉన్న బైజూస్ తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని, బైజూస్ కంటెంట్ మిగితా రాష్ట్రాలు వ్యతిరేకించాయని డీఎల్ అన్నారు. బైజూస్ పేరుతో ప్రభుత్వం 1400కోట్లు వృధా చేస్తుందని, బైజూస్‌తో ఒప్పందం కోసం ఇద్దరు కడప జిల్లా‌కు చెందిన వ్యక్తులు చక్రం తిప్పారని డీఎల్ ఆరోపించారు. టాలెంట్ ఉన్న ఉపాధ్యాయులను కాదని బైజూస్‌తో పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. బైజూస్‌తో ప్రభుత్వ ఒప్పందం ఒక మోసం. బైజూస్ కోసం ఖర్చుచేస్తున్న 1400కోట్లలో కనీసం కొంతైన ఉపాధ్యాయులకు ఖర్చు చేయాలి. విద్యార్థులు విషయం లో ప్రభుత్వం అవినీతి మానుకోవాలని డీఎల్ అన్నారు.

DL Ravindra Reddy : అధికారం కోసం అడ్డదారులు తొక్కడం మంచిది కాదు-డీఎల్ షాకింగ్ కామెంట్స్

నేను ఇంకా వైకాపా‌లో కొనసాగుతున్నా.. నన్ను పార్టీ నుండి ఇంకా తొలగించలేదన్నారు. అవినీతికి తావులేకుండా పరిపాలన చేస్తానని జగన్ చెప్పాడని, నా స్నేహితుడు కుమారుడు జగన్ ఇంత అవినీతిపరుడుగా మారుతాడని నేను ఊహించలేదని డీఎల్ అన్నారు. ప్రభుత్వం అందించే చీప్ లిక్కర్ తాగి మా మండలంలో ఆరుగురు చనిపోయారన్న డీఎల్.. తప్పు చేసిన వాడు తప్పించుకోలేరన్నారు. చట్టం నుంచి తప్పించుకున్నా దేవుడు శిక్షిస్తాడని అన్నారు.

Viveka Case: వివేకా హత్య కేసులో ప్రధాన సూత్రధారి శివశంకర్ రెడ్డే

వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తు ఉండొచ్చుని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని బాగుచేసే అవకాశం ఉందని డీఎల్ అన్నారు. పవన్ కళ్యాణ్ నిజాయితీ కలిగిన నాయకుడే అన్ని డీఎల్, పరిపాలనా శక్తి పవన్ కల్యాణ్ కు లేదన్నారు. ఇక వివేకా హత్య కేసు గురించి మాట్లాడుతూ.. జనవరి 3వ తేదీ తర్వాత కేసు ఊహించని మలుపు తిరుగుతుందని అన్నారు. చాలా మంది మెడకు ఉచ్చు బిగిసే అవకాశం ఉందని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు