Andhra Pradesh Politics : అనపర్తిలో చంద్రబాబును అడ్డుకోవటంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

అనపర్తిలో చంద్రబాబును అడ్డుకోవడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ నుంచి నారా లోకేష్ వరకూ పాదయాత్రలు చూశాను కానీ నిన్న అనపర్తిలో చంద్రబాబును అడ్డుకున్ పరిస్థితులను మాత్రం ఎప్పుడూ చూడలేదని ఇటువంటి చర్యలు వైసీపీకి మైనస్ అవుతాయని సూచించారు.

Andhra Pradesh Politics : అనపర్తిలో చంద్రబాబును అడ్డుకోవడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ నుంచి నారా లోకేష్ వరకూ పాదయాత్రలు చూశాను కానీ నిన్న అనపర్తిలో చంద్రబాబును అడ్డుకున్ పరిస్థితులను మాత్రం ఎప్పుడూ చూడలేదని ఇటువంటి చర్యలు వైసీపీకి మైనస్ అవుతాయని సూచించారు. ఓ వ్యక్తిని గానీ పార్టీని గానీ అణచాలని చూస్తే అది మరింత బలంగా మారుతుందని అటువంటి పనులే ఇప్పుడు వైసీపీ చేస్తోందని అనపర్తిలో చంద్రబాబును అడ్డుకోవటం వల్ల అది చంద్రబాబు ప్లస్ అవుతుంది వైసీపీకి మైనస్ అవుతుందని అన్నారు. ఎవరైనా ఎక్కడైనా పాదయాత్రలు చేసుకోవచ్చు..పర్యటనలు చేసుకోవచ్చు..సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు వాటిని అడ్డుకునే హక్కు ఎవ్వరి లేదని ఆఖరి ప్రభుత్వానికి కూడా ఉండదని అన్నారు ఉండవల్లి. రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయని వ్యాఖ్యానించిన ఉండవల్లి.. జగన్‌ను కాంగ్రెస్ జైలుకు పంపడంతోనే సీఎం అయ్యారని గుర్తు చేశారు.

కాగా..శుక్రవారం (ఫిబ్రవరి 17,2023)తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటనకు అనుమతుల అంశం ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. ముందురోజునే సభకు అనుమతిచ్చి.. ఆ తరువాత వెంటనే అనుమతి లేదంటూ అరాచకం సృష్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. సభను అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసులు చిత్ర విచిత్ర వ్యూహాలు పన్నారన్నారు. నిరసనకారుల తరహాలో ఖాకీ దుస్తులతో పోలీసులే రోడ్డుపై బైఠాయించడం ఏంటని నిప్పులు చెరిగారు. ఇకపై పోలీసులకు సహకరించబోమని..సహాయ నిరాకరణ ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు.

చంద్రబాబు అనపర్తి పర్యటనను అడ్డుకోవటానికి పోలీసులు తీవ్రంగా యత్నించారు. ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. వాహనానికి అడ్డంగా లారీలు,వ్యాన్లు పెట్టారు. అయినా చంద్రబాబు కాలినడకతో దాదాపు ఎనిమిది కిలోమీటర్లు నడిచి అనపర్తి చేసుకున్నారు. చంద్రబాబు వాహనాన్ని అడ్డుకుంటే పర్యటన ఆగిపోతుందని భావించిన పోలీసులకు షాక్ ఇస్తు చంద్రబాబు కాలినడకను రోడ్డువెంట నడుస్తూ వెళ్లారు. అయినా పోలీసులు ఆయనను అడ్డుకోవడానికి శతవిధాల యత్నిస్తూ ఆఖరికి నడకను కూడా ఆపివేయాలని ఆ దారి వెంట విద్యుత్ నిలిపివేశారు. దీంతో చీకటిలోనే చంద్రబాబు నడకను కొనసాగించేసరికి ఆ పాచిక కూడా పారలేదని పోలీసుల పరిపరి విధాల చంద్రబాబు అడ్డుకోవటానికి యత్నించారు.

అయినా అన్నింటినీ ఎదుర్కొని చంద్రబాబా సభాస్థలికి చేరుకున్నారు. అయినా అక్కడ కూడా విద్యుత్ నిలిపివేశారు పోలీసులు. ఆఖరికి జనరేటర్ ఆన్ చేసి సభను నిర్వహిస్తుండటంతో పోలీసులు మరింత అత్యుత్సాహంగా జనరేటర్ ఆపరేట్ చేసే వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. అయినా చంద్రబాబు తన ప్రసంగాన్ని టీడీపీ శ్రేణులు సెల్ ఫోన్ లతో సంఘీభావం తెలుపుతుండా ఆ వెలుగులోనే తన్ ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు. ఇలా ఒకటీ రెండూ కాదు చంద్రబాబును వచ్చినదారి వెంటనే తిరిగి వెనక్కి పంపించేయటానికి పోలీసులు రోడ్లపై బైఠాయించారు.

చంద్రబాబు సభకు ముందుగా ఇచ్చిన అనుమతులు హఠాత్తుగా రద్దు చేస్తున్నామని మీరు ఇక్కడనుంచి వెళ్లిపోమన్ని ఆదేశించారు.దానికి చంద్రబాబు మీరే అనుమతులు ఇచ్చారని అంటూ దానికి సంబంధించిన పత్రాలను చూపించారు. మీ ఇష్టమొచ్చినట్లుగా అనుమతులు రద్దు చేస్తారా? అన్యాయంగా నా పర్యటనను అడ్డుకుంటారా? మీరు పోలీసులేనా? మీరు చేసే ఈ చర్యలకు మీ ఒంటిమీద ఖాకీ యూనిఫాం సిగ్గుపడుతుందయ్యా..ఇటువంటి పనులు చేయవద్దు అంటూ పోలీసులకు సూచించారు. ఇలా ఒకటీ రెండూ కాదు..ఆ రోజంతా పోలీసులు సృష్టించిన రచ్చపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నిప్పులు చెరిగారు.

‘ఇకపై పోలీసులకు సహకరించం. సహాయ నిరాకరణ ప్రకటిస్తున్నా’ అని ప్రకటించారు. నాడు మహాత్ముడు నిర్వహించిన ‘దండి యాత్ర’ స్ఫూర్తితో… ‘అనపర్తి మార్చ్‌’ నిర్వహిస్తున్నా అంటూ వేలాదిమంది కార్యకర్తలు కదిలిరాగా, ఆరు కిలోమీటర్ల మేర రోడ్డుమీదనే నడుచుకుంటూ అన్ని అడ్డంకులనూ ఛేదించుకుని అనపర్తి దేవీచౌక్‌ రైల్వే స్టేషన్‌ రోడ్డులో జరిగిన సభకు భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పోలీసుల వైఖరిపై నిప్పులు చెరిగారు. ఏదిఏమైనా ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవాలని పోలీసు అధికారులు యత్నించగా… ‘మైక్‌ దగ్గరికొస్తే సహించేది లేదు’ అని చంద్రబాబు హెచ్చరికలు చేశారు.

పోలీసులు చంద్రబాబు వద్దకు రావటానికి యత్నిస్తుంటే టీడీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకుని రాకుండా ఆపారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రజలకు చెప్పాల్సిందంతా చెప్పారు. జనాల ఉత్సాహాన్ని చూసిన చంద్రబాబు మరింత ఉత్సాహంగా తన ప్రసంగాన్ని కంటిన్యూ చేసి పూర్తి చేసి తను అనుకున్నది చేసి చూపించారు.అలా చంద్రబాబు పట్టుదలతో పోలీసుల కల్పించిన అడ్డుకుల్ని ఎదుర్కొన్న తీరు అనపర్తి దేవీ చౌక్‌ వేదికగా మారింది.

 

 

ట్రెండింగ్ వార్తలు