AP Secretariat Corona : ఏపీ సచివాలయంలో కరోనాతో నలుగురు ఉద్యోగుల మృతి

ఏపీ సచివాలయంపై కరోనా పంజా విసిరింది. కరోనా సెకండ్ వేవ్ భయంతో ఏపీ సచివాలయం ఉద్యోగులు వణికిపోతున్నారు.

AP Secretariat Corona : ఏపీ సచివాలయంలో కరోనాతో నలుగురు ఉద్యోగుల మృతి

Ap Secretariat Corona

Corona at the AP Secretariat : ఏపీ సచివాలయంపై కరోనా పంజా విసిరింది. కరోనా సెకండ్ వేవ్ భయంతో ఏపీ సచివాలయం ఉద్యోగులు వణికిపోతున్నారు. గడిచిన మూడు రోజుల్లో నలుగురు ఉద్యోగులు మృతి చెందడంతో సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హోమ్ శాఖలో ఆర్‌అండ్‌టీ అసిస్టెంట్ ఏ ఎస్ ఎన్ మూర్తి కరోనాతో మృతి చెందారు.

పంచాయతీ రాజ్ శాఖలో సెక్షన్ ఆఫీసర్ గా పని చేస్తున్న శాంత కుమారి కూడా మృతి చెందారు. మూడు రోజుల క్రితం శాంత కుమారి భర్త, సచివాలయంలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్న వి.పద్మా రావు కూడా కరోనాతో మృతి చెందారు.

ఇంకా అనేక మంది సచివాలయ ఉద్యోగులు కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు సచివాలయంలోని వివిధ సెక్షన్స్‌లో పనిచేస్తున్న దాదాపు 100 మందికి పైగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సచివాలయానికి వచ్చి పనిచేయలేమని ఉద్యోగులు చెబుతున్నారు.

వర్క్ ఫ్రమ్ హోమ్‌కి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 50మంది ఉద్యోగులు రోటేషన్ పద్ధతిలో విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్యోగుల డిమాండ్‌పై ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లోనే ఓ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.