RK Beach : విశాఖ ఆర్కే బీచ్‌లో నలుగురు యువకులు గల్లంతు

అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్ లో విద్యార్థులు గల్లంతైన ఘటన మరువక ముందే విశాఖ ఆర్కే బీచ్ లో యువకుల గల్లంతు కలకలం రేపింది. నలుగురు యువకులు ఆర్కే బీచ్ లో గల్లంతయ్యారు. ఒక్కసారిగా అలలు ఎగసిపడటంతో యువకులు సముద్రంలోకి వెళ్లారు.

RK Beach : విశాఖ ఆర్కే బీచ్‌లో నలుగురు యువకులు గల్లంతు

Rk Beach

RK Beach : అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్ లో విద్యార్థులు గల్లంతైన ఘటన మరువక ముందే విశాఖ ఆర్కే బీచ్ లో యువకుల గల్లంతు కలకలం రేపింది. నలుగురు యువకులు ఆర్కే బీచ్ లో గల్లంతయ్యారు. ఒక్కసారిగా అలలు ఎగసిపడటంతో యువకులు సముద్రంలోకి వెళ్లారు. ఆ సమయంలో వారు కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు వారిని కాపాడారు. నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.

Pudimadaka Beach Tragedy : పూడిమడక బీచ్‌ ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

నలుగురు యువకులు ఒరిస్సా నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. సరదాగా స్నానం చేసేందుకు వారు ఆర్కే బీచ్ కి వెళ్లారు. బీచ్ లలో సముద్ర స్నానాలు చేయొద్దని హెచ్చరికలు ఉన్నప్పటికీ కొందరు పట్టించుకోవడం లేదు. ఆకతాయితనంగా సముద్రంలోనికి వెళ్తున్నారు. ఈ క్రమంలో అలల ఉధృతికి, ఎగసిపడుతున్న కెరటాలకు బలైపోతున్నారు. అమావాస్య, పౌర్ణమి సమయంలో సముద్రం అలజడిగా ఉంటుంది. అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఆర్కే బీచ్ ప్రాంతం అంతా రాళ్లతో కూడిన అలలు ఎక్కువగా ఉంటున్నాయి. భారీ అలలు వచ్చాయంటే ఆ ధాటికి చెల్లాచెదురు అయిపోతారు. ఎంత ఈత వచ్చినప్పటికీ రాకాసి అలల ఉధృతిని తట్టుకోవడం అంత సులభం కాదు.

ఇటీవలే అనకాపల్లి జిల్లాలో ఘోరం జరిగింది. అచ్యుతాపురం మండలం సీతాపాలెం పూడిమడక బీచ్ లో సరదాగా సముద్ర స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. నర్సీపట్నం డైట్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న 15మంది విద్యార్థులుకు శుక్రవారం పరీక్ష ముగిసిన తర్వాత పూడిమడక బీచ్ కు వెళ్లారు.

Pudimadaka Beach: పూడిమడక విషాదం.. గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం..

వీరిలో ఏడుగురు విద్యార్థులు బీచ్ లో స్నానానికి దిగగా.. మిగిలిన వారు ఒడ్డునే కూర్చున్నారు. అందరూ సరదాగా ఆడుకుంటుండగా ఓ రాకాసి అల దూసుకొచ్చి ఏడుగురు విద్యార్థులను లాక్కెళ్లిపోయింది. వీరిలో తేజ అనే విద్యార్థిని మత్స్యకారులు రక్షించి ఆస్పత్రికి తరించారు. ఘటన జరిగిన కొద్దిసేపటికి పవన్ అనే విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీశారు. శుక్రవారం అర్ధరాత్రి మరో ఇద్దరి మృతదేహాలు బయటడగా.. శనివారం మధ్యాహ్నం మిగిలిన ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి చేరింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కాలేజీలో పరీక్ష రాసిన అనంతరం ఫ్రెండ్స్ అందరూ కలిసి బీచ్ కు వెళ్లారు. సరదాగా స్నానం చేస్తుండగా ఈ ఘోరం జరిగింది. కళ్లముందే స్నేహితులు గల్లంతుకావడంతో విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. మరోవైపు చదువుకుని ఉన్నత స్థానాలకు వెళ్తారనుకున్న తమ పిల్లలు ఇక లేరని తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఒకేరోజు ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం డైట్ కాలేజీలో పెను విషాదం నింపింది.