Free Biryani : ఏపీలో కరోనా టీకా తీసుకున్న వారికి ఫ్రీ బిర్యానీ

కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు.. ఇలా వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఫ్రీగా బీరు, బిర్యానీ పథకాలను తీసుకొస్తున్నాయి.

Free Biryani : ఏపీలో కరోనా టీకా తీసుకున్న వారికి ఫ్రీ బిర్యానీ

Vizianagaram

covid vaccine In Andhrapradesh : భారతదేశ వ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. కొన్ని రాష్ట్రాల్లో వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆంక్షలు, నిబంధనలు విధిస్తున్నాయి. కొంతమంది ప్రజల నిర్లక్ష్యం మూలంగా కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి. మరోవైపు వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. అయితే..చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. ఏవైనా సైడ్ ఎఫెక్ట్ వస్తాయోనని, ఏమైనా జరుగుతుందని భయపడుతూ..వ్యాక్సిన్ తీసుకోవడం లేదు. ప్రజల్లో చైతన్యపరచడానికి, అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని స్వచ్చం సంస్థలు, వ్యాపారస్తులు కూడా వినూత్నంగా ముందుకు వస్తున్నారు. కరోనా టీకా వేయించుకుంటే..అది ఫ్రీ..ఒక బహుమతి అందిస్తామని చెబుతున్నారు. మొన్న ఓ వ్యాపారి మహిళలకు ముక్కు పుడక అందచేయగా..మరొకరు ఫ్రీగానే భోజనం అందిస్తున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ మందకొడిగానే కొనసాగుతోంది. అయితే ఊహించిన స్థాయిలో ప్రజలు ముందుకు రావడం లేదు. దీంతో ప్రజలను వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు పలు సంస్థలు తమ వంతు కృషి చేస్తున్నాయి. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు.. ఇలా వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఫ్రీగా బీరు, బిర్యానీ పథకాలను తీసుకొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ సంస్థ వ్యాక్సిన్ తీసుకున్నవారికి బిర్యానీ ఫ్రీగా ఇస్తామని ముందుకొచ్చింది. విజయనగరంలో ఉన్న హలో కిచెన్ (Hello kitchen) అనే సంస్థ ఈ ఆఫర్ తీసుకొచ్చింది. విజయనగరం, కాకినాడలో దీనికి బ్రాంచీలున్నాయి. హోటల్ దగ్గర కూడా ప్రచార బోర్డులు పెట్టారు.

దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫ్రీ బిర్యానీ కావాలని అనుకున్న వారు..మొదటగా వ్యాక్సిన్ తీసుకున్నట్లు రశీదు చూపించాల్సి ఉంటుంది. అయితే..ఇక్కడ ఈ సంస్థ కొన్ని కండీషన్స్ పెట్టింది. టీకా ఉత్సవంలో భాగంగా 2021, ఏప్రిల్ 11వ తేదీ ఆదివారం నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ ఆఫర్ ఉండనుంది. వ్యాక్సిన్ తీసుకున్న తొలి వంద మందికి మాత్రమే బిర్యానీ అందిమని, ఈ సంఖ్యను పెంచుతామని Hello kitchen నిర్వహిస్తున్న కొలగట్ల ప్రతాప్ వెల్లడించారు.