Fun Bucket Bhargav : నిన్న OMG నిత్య, నేడు మౌనిక, రేపు..? చిక్కుల్లో ఫన్ బకెట్ భార్గవ్ గర్ల్ ఫ్రెండ్స్

భార్గవ్ పై నమోదైన కేసు.. ఇప్పుడు కొందరు అమ్మాయిలకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. వారు తల ఎత్తుకుని తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తోంది. ఆ అమ్మాయిలు మరెవరో కాదు.. గతంలో భార్గవ్ తో కలిసి వీడియోల్లో యాక్ట్ చేసిన వారు. ఆ అమ్మాయిలు ఇప్పుడు తిప్పలు పడుతున్నారు.

Fun Bucket Bhargav : నిన్న OMG నిత్య, నేడు మౌనిక, రేపు..? చిక్కుల్లో ఫన్ బకెట్ భార్గవ్ గర్ల్ ఫ్రెండ్స్

Tiktok Fun Bucket Bhargav

TikTok Fun Bucket Bhargav : టిక్ టాక్ స్టార్, ఫన్ బకెట్ భార్గవ్ అలియాస్ చిప్పాడ భార్గవ్ అరెస్ట్ అయ్యాడనే న్యూస్, అతడిపై నమోదైన కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసు.. అతను చేసిన వీడియోలను మించి పాపులర్ అయ్యింది. మైనర్ పై భార్గవ్ అత్యాచారం కేసులో తవ్వేకొద్ది నిజాలు బయటపడుతున్నాయి. చాలామంది అమ్మాయిలు భార్గవ్ బాధితుల జాబితాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, భార్గవ్ పై నమోదైన కేసు.. ఇప్పుడు కొందరు అమ్మాయిలకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. వారు తల ఎత్తుకుని తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తోంది. ఆ అమ్మాయిలు మరెవరో కాదు.. గతంలో భార్గవ్ తో కలిసి వీడియోల్లో యాక్ట్ చేసిన వారు. ఆ అమ్మాయిలు ఇప్పుడు తిప్పలు పడుతున్నారు.

సోషల్ మీడియా, టిక్ టాక్ తో వచ్చిన ఫేమ్ ని భార్గవ్ తన కామ కోరికలు, అవసరాలు తీర్చుకునేందుకు వాడుకున్నాడు. అమాయక యువతులను నమ్మించి మోసం చేశాడు. టిక్ టాక్ లో పాపులర్ అవ్వాలనే కోరికతో ఉన్న అమ్మాయిలపై కన్నేసి వాళ్లను శారీరకంగా వాడుకున్నాడు. టిక్ టాక్ లో స్టార్ ని చేస్తానని, పాపులర్ గా మారుస్తానని, ఇతర మీడియా చానల్స్ లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి మభ్యపెట్టి చాలామంది యువతులను భార్గవ్ లోబర్చుకున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

భార్గవ్ బాధితుల్లో 14ఏళ్ల మైనర్ బాలిక గర్భం దాల్చడంతో భార్గవ్ నిజస్వరూపం బట్టబయలైంది. బాలికపై అత్యాచారం కేసులో విశాఖ పోలీసులు భార్గవ్ ను హైదరాబాద్ లో ఉండగా అరెస్ట్ చేశారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. టీవీ చానళ్లు, సినిమాల్లో ఆఫర్లు ఇస్తానని చెప్పి అమ్మాయిలను భార్గవ్ మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫన్ బకెట్ భార్గవ్ అలియాస్ చిప్పాడ భార్గవ్ బాగోతాలపై దిశ పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.

ఫన్ బకెట్ భార్గవ్ కేసు సంచలనంగా మారడంతో గతంలో అతడితో వీడియోలు చేసిన అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి. భార్గవ్ మోసం చేసింది వీళ్లనే, మైనర్ బాలిక ఈమే అంటూ వారి ఫొటోలతో సహా పోస్టులు పెడుతున్నారు. దీంతో వాళ్లంతా వివరణ ఇచ్చుకునే దుస్థితి వచ్చింది. వీడియోల రూపంలో అసలేం జరిగిందో చెప్పుకుంటున్నారు. ఆ మైనర్ బాలిక నేను కాదు, భార్గవ్ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. అందరిలాగే తమకు కూడా సోషల్ మీడియా ద్వారానే భార్గవ్ అరెస్ట్ విషయం తెలిసిందంటున్నారు. తమ ఫొటోలు, వీడియోలు ఈ కేసుకి లింక్ చేస్తూ వాడొద్దని వేడుకుంటున్నారు.

భార్గవ్ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలియగానే చాలామంది ఓమైగాడ్ నిత్య పేరుని తెరపైకి తెచ్చారు. ఆమె ఫోటోలను వాడుకున్నారు. ఈ కేసులో తన ఫొటోలు వాడటంపై నిత్య రియాక్ట్ అయ్యింది. భార్గవ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆ మైనర్ బాలిక నేను కాదని వివరణ ఇచ్చుకుంది.

నిత్య రియాక్షన్ మరువక ముందే.. నిత్య లాగే మరో టిక్ టాక్ ఫేమ్ మౌనిక కూడా తెరపైకి వచ్చింది. భార్గవ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మౌనిక తేల్చి చెప్పింది. అందరిలాగే తనకు కూడా భార్గవ్ కేసు విషయం సోషల్ మీడియా ద్వారానే తెలిసిందని చెప్పింది. గతంలో భార్గవ్ తో చేసిన ఫొటోలను, వీడియోలను తీసుకుని ఇప్పుడు జరుగుతున్న కేసుతో సంబంధం అంటగడుతున్నారని వాపోయింది. వాస్తవానికి భార్గవ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. ఇప్పటికైనా తన వీడియో చూశాక అవన్నీ డిలీట్ చేస్తారని ఆశిస్తున్నానని మౌనిక ఆకాంక్షించింది. దయచేసి తన ఫొటోలు, వీడియోలు వాడొద్దని విజ్ఞప్తి చేసింది.

త్వరలోనే భార్గవ్ పై పోలీసులు చార్జిషీటు వేయనున్నారు. ఇంకా ఎంతమంది అమ్మాయిలను మోసం చేశాడనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఇన్వెస్టిగేషన్ లో భార్గవ్ మోసాలు, అతడు వేసిన వేషాలన్నీ బయటపెట్టనున్నారు. ఆధారాలన్నీ సేకరించి భార్గవ్ కు కఠిన శిక్ష పడేలా చూసే పనిలో పోలీసులు ఉన్నారు.