TikTok Fun Bucket Bhargav : వీడు మామూలోడు కాదు.. కన్నుపడితే ఖతమే.. ఫన్ బకెట్ భార్గవ్ బాధితుల్లో అనేకమంది అమ్మాయిలు

ఫన్ బకెట్ భార్గవ్.. గత రెండు రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అతడి అరెస్ట్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. పాడు పని చేశాడని తిట్టిపోస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ ఆటాడుకుంటున్నారు. మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఫేమస్ చేస్తానని నమ్మించి చివరికి గర్భవతిని చేశాడు. అతడు చేసిన పనికి అంతా దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకా అతడి బాధితుల జాబితాలో ఎవరెవరు ఉన్నారనేది వెలికి తీసే పనిలో ఉన్నారు పోలీసులు.

TikTok Fun Bucket Bhargav : వీడు మామూలోడు కాదు.. కన్నుపడితే ఖతమే.. ఫన్ బకెట్ భార్గవ్ బాధితుల్లో అనేకమంది అమ్మాయిలు

Fun Bucket Bhargav Victims

TikTok Fun Bucket Bhargav : ఫన్ బకెట్ భార్గవ్.. గత రెండు రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అతడి అరెస్ట్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. పాడు పని చేశాడని తిట్టిపోస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ ఆటాడుకుంటున్నారు. మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఫేమస్ చేస్తానని నమ్మించి చివరికి గర్భవతిని చేశాడు. అతడు చేసిన పనికి అంతా దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకా అతడి బాధితుల జాబితాలో ఎవరెవరు ఉన్నారనేది వెలికి తీసే పనిలో ఉన్నారు పోలీసులు.



సోషల్ మీడియా ఎంతోమందికి పేరు తెచ్చిపెట్టింది. చాలామంది టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసింది. అలా కొందరికి అవకాశాలు కూడా వచ్చాయి. కొందరు సెలబిట్రీలు అయిపోయారు. కొందరు సరైన దారిలోనే వెళ్తున్నారు. ఎంతోకొంత డబ్బు సంపాదించుకుంటున్నారు. సోషల్ మీడియా తెచ్చిపెట్టిన ఫేమ్ తో కొందరు తమ కెరీర్ ని సెట్ చేసుకుంటున్నారు. కానీ, ఫన్ బకెట్ భార్గవ్ లాంటి వాళ్లు మాత్రం తమ పేరుని, పాపులారిటీని మరో విధంగా వాడుకుంటున్నారు. మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి లోబర్చుకుంటున్నారు. వారిని శారీరకంగా అనుభవించి తమ కామకోరికలు తీర్చుకుంటున్నారు. కానీ, ఏదో ఒక రోజు పాపం పండక తప్పదు. అప్పుడు చట్టం వారి తాట తీస్తుంది. ఇప్పుడు భార్గవ్ విషయంలోనూ అదే జరిగింది. భార్గవ్ పాపం పండింది.



అంతా అనుకుంటున్నట్టు భార్గవ్ సుద్దపూసేమీ కాదు. అమ్మాయిలంటే అతడికి లెక్కేలేదు. తను ఫేమస్ అయ్యేందుకు అమ్మాయిలతో వీడియోలు చేస్తాడు. కానీ, వాళ్లకు అసలు గౌరవమే ఇవ్వడు. మరో పెద్ద విషయం ఏంటంటే..అతడో ఉమనైజర్. అమ్మాయిలు తనకు లొంగకపోతే సెంటిమెంటల్ గా బ్లాక్ మెయిల్ చేస్తాడు. సోషల్ మీడియాలో ఫేమస్ చేస్తానని మాయమాటలు చెప్పి లోబర్చుకుంటాడు. తన పబ్లిసిటీ కోసం అమ్మాయిలను బాగా వాడుకుంటాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే పలు ఇంటర్వ్యూలో చెప్పాడు. అతడి మాటలు చేష్టలు చూస్తుంటే అమ్మాయిల పట్ల అసలు రెస్పక్టే లేదన్న విషయం ఇట్టే తెలిసిపోతుంది. భార్గవ్ ని నమ్మి వచ్చిన చాలామంది అమ్మాయిలు అతడి చేతిలో మోసపోయారు. కొందరు బయటకు చెప్పలేక లోలోపలే నరకం అనుభవిస్తున్నారు.



కానీ మైనర్ బాలిక గర్భవతి కావడంతో భార్గవ్ పోలీసులకు చిక్కాడు. అతడు చేసిన టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ వీడియోలే.. అమ్మాయిలంటే అతడికి ఎంత పిచ్చో చెప్పేస్తాయి. అమ్మాయిలను పట్టుకోవడం, టచ్ చెయ్యడం, యాక్టింగ్ పేరుతో ముద్దులు పెట్టుకోవడం.. పాపులారిటీ కోసమే ఇదంతా అని చెప్పుకోవడం అతడి స్టైల్. బయటకు చెల్లి చెల్లి అని పిలుస్తేనే వీడియోలో లవర్ గా చిత్రీకరిస్తాడు. అడ్డగోలు వీడియోలు చేసి అమ్మాయిలను అడ్డంగా బుక్ చేస్తాడు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని తన దగ్గరికి వచ్చే అమ్మాయిని లొంగదీసుకోవాలని చూస్తాడు భార్గవ్. అలా 14ఏళ్ల మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి చాలాసార్లు అత్యాచారం చేశాడు.



చివరికి గర్భవతిని కూడా చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో విశాఖ పోలీసులు చిప్పాడ భార్గవ్ ను అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన భార్గవ్ మొదట్లో ఫన్ బకెట్ పేరుతో వీడియోలు చేసేవాడు. టిక్ టాక్ తో బాగా పాపులర్ అయ్యాడు. తర్వాత విశాఖలో ఉంటూ సింహగిరి కాలనీకి చెందిన ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆ అమ్మాయి కూడా టిక్ టాక్, సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఇంట్రస్ట్ ఉండటంతో తరుచూ భార్గవ్ ని కలిసేది. ఇదే అదనుగా ఆ నీచుడు తన కోరిక తీర్చుకున్నాడు. చెల్లి అని పిలుస్తూనే.. లవ్ ప్రపోజల్ చేశాడు. అందుకు నో చెప్పడంతో.. బాలికకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఉన్నాయని బెదిరించాడు. అలా ఆ బాలికను లొంగదీసుకుని అత్యాచారం చేసి కడుపు తెప్పించాడు.