Corona Deaths Guntur : గుంటూరు జిల్లాలో కరోనా విలయం.. నిత్యం 50 మృతదేహాలకు అంత్యక్రియలు

కరోనా విలయతాండవం ఎలా ఉంటుందో.. గుంటూరు జిల్లాలోని ఈ స్మశానవాటికను చూస్తే తెలిసిపోతుంది. బొంగరాల బీడు స్మశాన వాటికలో నిత్యం పదుల సంఖ్యలో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

Corona Deaths Guntur : గుంటూరు జిల్లాలో కరోనా విలయం.. నిత్యం 50 మృతదేహాలకు అంత్యక్రియలు

Corona Deaths Guntur

Funeral of 50 corona dead bodies daily : కరోనా విలయతాండవం ఎలా ఉంటుందో.. గుంటూరు జిల్లాలోని ఈ స్మశానవాటికను చూస్తే తెలిసిపోతుంది. బొంగరాల బీడు స్మశాన వాటికలో నిత్యం పదుల సంఖ్యలో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఒకేసారి 40 నుంచి 50 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న దృశ్యాలు కరోనా కరాళనృత్యాన్ని చాటుతున్నాయి.

వివిధ ఆస్పత్రుల్లో కరోనాతో చేరి చికిత్స పొందుతూ చనిపోయిన వారికి అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్‌ సభ్యులు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కుటుంబసభ్యులు భయంతో తీసుకెళ్లకుండా మిగిలిన మృతదేహాలకు కూడా వీళ్లే అంత్యక్రియలు నిర్వహిస్తూ అందరికీ స్పూర్తిగా నిలుస్తున్నారు.

గుంటూరు నగరంలోని బొంగరాల బీడు స్మశాన వాటిక మృతదేహాలతో నిండిపోయింది. ప్రతి రోజు నలభై, యాభై మృతదేహాలకు ఇక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కరోనాతో చనిపోతున్న వారి మృతదేహాలకు అమ్మ ఛారిటబుల్ సభ్యులే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

అయితే వివిధ ఆసుపత్రుల్లో కరోనా తో చేరి చికిత్స పొందుతూ మృతి చెందిన వారిని కరోనాతోనే మృతి చెందినట్లు అధికారకంగా గుర్తించడం లేదు. హార్ట్ ఎటాక్, దీర్ఘ కాలిక వ్యాధులతో చనిపోతున్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు.

దీంతో ఈ మరణాలన్నీ కరోనా అధికారక లెక్కల్లో కనిపించడం లేదు.కరోనాతో అయిన వారిని కోల్పోయి అంత్యక్రియలు కూడా చేయలేకపోయిన వారికి అమ్మ ఛారిటబుల్ సభ్యులు అండగా నిలబడటం పలువురి ప్రసంశలందుకుంటుంది.