పవన్ కళ్యాణే మఖ్యమంత్రి అభ్యర్థి: జీవీఎల్

పవన్ కళ్యాణే మఖ్యమంత్రి అభ్యర్థి: జీవీఎల్

Pawan Kalyan Gvl

తిరుపతిలో నామినేషన్ల ఘట్టం క్లైమాక్స్‌కు చేరుకోగా ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన సీఎం అభ్యర్థి పవనే అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. పవన్ కళ్యాణ్ విషయంలో బీజేపీ స్పష్టతతో ఉందని జీవీఎల్ స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ హైకమాండ్ విధానాన్నే సోము వీర్రాజు చెప్పినట్లుగా జీవీఎల్‌ స్పష్టం చేశారు.

అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. బీజేపీ, జనసేన ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణే అనే విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జీవీఎల్ అదే విషయమై స్పష్టతనిచ్చారు.

మరోవైపు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తోన్న బీజేపీ తిరుపతి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని లక్ష్యంగా చేసుకొని ట్వీట్ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకిస్తూ.. పనబాక లక్ష్మి పాత వీడియోను బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ట్వీట్ చేశారు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ గతంలో లక్ష్మి చేసిన వీడియోను పోస్ట్ చేశారు. చంద్రబాబు సీఎం ఎలా అయ్యారో తెలీదా? అంటూ గతంలో లక్ష్మీ చేసిన విమర్శలను ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే.. తిరుపతి ఉప ఎన్నిక సాక్షిగా ప్రత్యేక హోదా మంటలు చెలరేగుతున్నాయి.. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని తిరుపతి లోక్‌సభ అభ్యర్థి రత్నప్రభ ప్రకటించడంపై విమర్శలు వస్తున్నాయి.. ఈ వ్యాఖ్యలపై సీపీఐ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.. రత్నప్రభ ఎన్నిక కూడా నామినేషన్‌తోనే ముగుస్తుందని విమర్శించారు.