Mansas Trust : బాధ్యతలు స్వీకరించిన గజపతిరాజు..మాన్సాస్ ఈవో, కరస్పాండెంట్ గైర్హాజర్

మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా అశోక్ గజపతిరాజు బాధ్యతలు స్వీకరించారు. అయితే..ఈ సమయంలో..మాన్సాస్ ఈవో, కరస్పాండెంట్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈ సందర్భంగా..అధికారుల గైర్హాజరుపై అశోక్‌ గజపతిరాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Mansas Trust : బాధ్యతలు స్వీకరించిన గజపతిరాజు..మాన్సాస్ ఈవో, కరస్పాండెంట్ గైర్హాజర్

Mansas

Ashok Gajapathi Raju : మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా అశోక్ గజపతిరాజు బాధ్యతలు స్వీకరించారు. అయితే..ఈ సమయంలో..మాన్సాస్ ఈవో, కరస్పాండెంట్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈ సందర్భంగా..అధికారుల గైర్హాజరుపై అశోక్‌ గజపతిరాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా..అశోక్ గజపతి రాజు..మీడియాతో మాట్లాడారు. సింహాచలం ఆలయ ఈవో కూడా తనను కలవడానికి ఇష్టపడ లేదని, రామతీర్థానికి పంపిన చెక్కును వెనక్కి పంపి తనను మానసిక క్షోభకు గురి చేశారన్నారు.

మాన్సాస్ భూముల్లో అక్రమాలు : –
రామతీర్థం విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మాన్సాస్ భూముల్లో ఇసుక అక్రమాలు ఎవరి హయాంలో జరిగాయో తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై తానే దేవాదాయ శాఖ కమిషనర్ కి లేఖ రాసినట్లు, అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని ఈ సందర్భంగా తాము కోరడం జరిగిందన్నారు. అక్రమాలపై విచారణ జరిపితే, ఆ రిపోర్ట్ ను ఎందుకు బయట పెట్టడం లేదు ? అలా బయట పెట్టడం లేదంటే…అందరినీ మభ్యపెడుతున్నారని అనుకోవాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే తమ ట్రస్ట్ కార్యకలాపాలపై కలెక్టర్ ని విచారణ చేయమని ఆనాడు..ఓ మంత్రి ఆదేశించారని, కలెక్టర్ విచారం చేసి, ప్రభుత్వానికి రిపోర్ట్ పంపారన్నారు. మరి ఎందుకు ఆ నివేదికను బహిరంగ పర్చడం లేదని సూటిగా ప్రశ్నించారు అశోక్ గజపతిరాజు.

కార్యాలయం ఎందుకు తరలిస్తున్నారు ?  : –
విజయనగరం నుంచి కార్యాలయం ఎందుకు తరలిస్తున్నారో తెలియడం లేదని, ట్రస్టుకు సంబంధించి ఏడాదిగా అడిట్ జరగలేదంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. అడిట్ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని స్పష్టం చేశారు. అడిట్ ఫీజును కూడా క్రమం తప్పకుండా చెల్లించినట్లు, ట్రస్ట్ డీల్ లో భాగంగా ప్రభుత్వం అనుమతితో భూముల అమ్మకాలు, కొనుగోలు చేయవచ్చన్నారు. తాను ట్రస్ట్ చైర్మన్ గా రాకముందే భూముల అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకున్నారనే విషయాన్ని వెల్లడించారు.

రూ. 100 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు : –
తాను బాధ్యతలు చేపట్టే సమయం నాటికి ఆ విధానం ఉందని, ప్రొసీజర్ ప్రకారం ట్రస్ట్ వ్యవహరించి, దేవాదాయ శాఖ అనుమతులతో ప్రభుత్వ సంస్థ ఉడా అధ్యర్యంలో నాడు భూముల అమ్మకాలు జరిగాయని వెల్లడించారు అశోక్ గజపతిరాజు. ఇందులో ఎటువంటి అక్రమాలు జరిగాయో ప్రభుత్వమే తెలపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ట్రస్ట్ కి సుమారు రూ. 100 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్నాయని, మరి సిబ్బందికి జీతాలు ఇవ్వడంలో సమస్య ఎందుకు వచ్చిందో తెలియదన్నారు. లెప్రసి మిషన్ భూములు వ్యవహారం ప్రభుత్వమే తేల్చుకోవాలని, అవి కోర్టు పరిధిలో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. దోపిడి దారులకు మాన్సాస్ ట్రస్టులో స్థానం లేదని మరోసారి స్పష్టం చేశారు అశోక్‌ గజపతిరాజు.