AU Ganja : ఆంధ్రా యూనివర్సిటీలో మత్తు మాఫియా కలకలం.. గుట్టుగా గంజాయి అమ్మకాలు

విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ డ్రగ్స్ కు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్యాంపస్ లో గంజాయి అమ్మకం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన ముగ్గురు నిందితుల్లో యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డు ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

AU Ganja : ఆంధ్రా యూనివర్సిటీలో మత్తు మాఫియా కలకలం.. గుట్టుగా గంజాయి అమ్మకాలు

AU Ganja : విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ డ్రగ్స్ కు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్యాంపస్ లో గంజాయి అమ్మకం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన ముగ్గురు నిందితుల్లో యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డు ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

బీచ్ రోడ్ లోని యోగా విలేజ్, మహిళా ఇంజినీరింగ్ కాలేజ్ దగ్గర గంజాయి విక్రయిస్తూ సెక్యూరిటీ గార్డు పోలీసులకు చిక్కడం చర్చనీయాంశంగా మారింది. వేలాది మంది విద్యార్థులు చదువుకునే చోట గంజాయి ఆనవాళ్లు బయటపడటం విస్మయానికి గురి చేస్తోంది. యూనివర్సిటీ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలను నిలువరించాల్సిన సెక్యూరిటీ సిబ్బంది గంజాయితో పట్టుబడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Also Read..Visakha : విశాఖ బీచ్‌లో బైకులతో యువకుల ఫీట్లు..హడలిపోతున్న పర్యాటకులు

విశాఖలో డ్రగ్స్ దందా జోరుగా సాగుతోందని అనడానికి ఏయూ ఘటనే నిదర్శనం. గతంతో పోలిస్తే ఇటీవల గంజాయి అక్రమ రవాణ విపరీతంగా పెరిగింది. జిల్లా సరిహద్దులను దాటిస్తున్న వారిలో యువతే ఎక్కువగా పట్టుబడుతున్నారు. చాలా చోట్ల గంజాయి సేవిస్తున్న వ్యక్తులను పోలీసులు గుర్తిస్తున్నారు. ఇటీవల పోలీసులు మత్తు ఇంజెక్షన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఏయూలో మత్తు పదార్దాల విక్రయాలు సాగుతున్నాయనే విమర్శలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. గతంలో ఒకసారి యూనివర్సిటీలో లా విద్యార్థులు, బయటి కాలేజీ విద్యార్థులు గంజాయి వ్యవహారంలోనే పెద్ద ఎత్తున గొడవ పడి పోలీసులకు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లారు. ఆ తర్వాత ఇలాంటి ఘటనలు వెలుగులోకి రానప్పటికి, యూనివర్సిటీలో గుట్టుగా గంజాయి సరఫరా జరుగుతోందన్న ఆరోపణలూ ఉన్నాయి. విద్యావనంలో గంజాయి దందా సాగుతోందన్న విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.

Also Read.. Visakhapatnam Cannabis : మత్తు స్మగ్లర్లకు అడ్డాగా విశాఖ..! టన్నుల కొద్దీ గంజాయి అక్రమ రవాణ

ఏయూలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న చంద్రమౌళితో పాటు ఆటో డ్రైవర్ సురేశ్, సతీశ్ ఏయూ పరిసరాల్లో గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు దర్యాఫ్తులో తేలింది. వారిచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలమాంబ గుడి నుంచి యూనివర్సిటీ వరకు గతంలో దుకాణాలు ఉండేవి. వీటిలో గుట్టుగా గంజాయి విక్రయాలు సాగుతున్నాయన్న సమాచారంతో అధికారులు వాటిని తొలగించారు. ఇప్పుడు ఏకంగా సెక్యూరిటీ సిబ్బందే గుట్టుగా గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డారు. యూనివర్సిటీ కేంద్రంగా ఇలాంటి వ్యవహారం సాగుతోందనే విషయం వెలుగులోకి రావడంతో అధికారుల్లో అలజడి మొదలైంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

వర్సిటీలో గంజాయి దందా వ్యవహారాన్ని అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. విక్రయాల వెనుక సెక్యూరిటీ గార్డుతో పాటు ఇంకా ఎవరెవరున్నారో తేల్చే పనిలో పడ్డారు. గంజాయి విద్యార్థులకు చేరుతోందా అనే అంశంపై ఆరా తీస్తున్నారు అధికారులు.