Vallabhaneni Vamsi : ఇక్కడ నేను, అక్కడ కొడాలి నాని.. గన్నవరంలో నేనేంటో చూపిస్తా-వల్లభనేని వంశీ హాట్ కామెంట్స్

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ దెబ్బకు కుప్పంలో చంద్రబాబు కూసాలు కదిలిపోయాయి అన్నారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరంలో పోటీ చేసేది నేనే అన్న వంశీ.. గెలిచేది కూడా నేనే అని ధీమా వ్యక్తం చేశారు.

Vallabhaneni Vamsi : ఇక్కడ నేను, అక్కడ కొడాలి నాని.. గన్నవరంలో నేనేంటో చూపిస్తా-వల్లభనేని వంశీ హాట్ కామెంట్స్

Vallabhaneni Vamsi : గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ దెబ్బకు కుప్పంలో చంద్రబాబు కూసాలు కదిలిపోయాయి అన్నారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరంలో పోటీ చేసేది నేనే అన్న వంశీ.. గెలిచేది కూడా నేనే అని ధీమా వ్యక్తం చేశారు.

Also Read..Chandrababu Naidu : జగన్ ఓటమి ఖాయం, ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

”సంకల్ప సిద్ది మార్ట్ పై నేను గతంలో గన్నవరం కోర్టుని ఆశ్రయించా. నాకు సంబంధం లేని అంశంలో నా మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేను ఒక్క పట్టాభిపై మాత్రమే పరువు నష్టం దావా వేశాను. తదుపరి వాయిదా 3న వేశారు. దుట్టా రామచంద్రరావు కూతురుకి ఉంగుటూరు జడ్పీటీసీ పదవి ఇచ్చినందుకు నా మీద కోపం పెంచుకున్నాడేమో?

Also Read..AP Early Elections : 75మంది తిరుగుబాటుకు సిద్ధం, నవంబర్‌లోపే ముందస్తు ఎన్నికలు..! అచ్చెన్న సంచలనం

వచ్చే ఎన్నికల్లో నాకు సపోర్ట్ చేసినా చెయ్యక పోయినా వైసీపీ తరపున పోటీ చేసేది నేనే, గెలిచేది నేనే. ఏ వర్గం అయినా కొంతమందికి నేను పదవులిచ్చాను. వాళ్ళు అది కాపాడుకుంటే మంచిది. ఎన్నికల్లో ఓడిపోగానే నేను తట్టాబుట్టా సర్దుకుని పోలేదు. నేను ఎంపీగా పోటీ చేసిన సమయంలో కూడా నా కార్యాలయం గన్నవరంలోనే ఉంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

చంద్రబాబు వాళ్ల నాన్న ఖర్జూరం నాయుడు గాని వాళ్ల తాత లవంగం నాయుడు గాని ఎవరు వచ్చినా నాది, కొడాలి నానిది వెంట్రుక కూడా పీకలేరు. నన్ను గెలిపించాల్సింది గన్నవరం నియోజకవర్గ ప్రజలు, కొడాలి నానిని గెలిపించాల్సింది గుడివాడ నియోజకవర్గం ప్రజలు. పట్టాభి గన్నవరం వస్తే నేనేంటో చూపిస్తా” అని ఫైర్ అయ్యారు వల్లభనేని వంశీ.