ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా.. కృష్ణా జిల్లా తొలి స్థానం

  • Published By: srihari ,Published On : June 12, 2020 / 11:21 AM IST
ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా.. కృష్ణా జిల్లా తొలి స్థానం

విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం (జూన్ 12) సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని గేట్ వే హోటల్ లో మంత్రి ఆదిమూలపు సురేశ్ తన చేతుల మీదుగా ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు.

ఇంటర్ ఫస్టియర్‌లో 59 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్ లో 63 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి తెలిపారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌ ఫలితాల్లో బాలికలదే హవా కనిపిస్తోంది. ఉత్తీర్ణత శాతంలో మొదటి స్థానంలో కృష్ణా జిల్లా నిలిచింది. ఫస్టియర్ బాలుర ఉత్తీర్ణత 55 శాతంగా ఉంది. సెకండియర్ లో బాలికల ఉత్తీర్ణత 67శాతంగా ఉంది. సెకండియర్ లో బాలుర ఉత్తీర్ణత 60శాతంగా నమోదైంది. ఇంటర్ లో 65 శాతం ఉత్తీర్ణతో గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలలకు రెండో స్థానం దక్కింది. 

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాసిన వారిలో 5,07,228 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలు 4,88,795 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఏపీ ఇంటర్ పరీక్షలకు 10,65,155 మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్ 15 నుంచి విద్యార్థులకు మార్కులు మెమోలు జారీ చేయనున్నట్టు చెప్పారు.