కాకినాడ సెజ్ లో 51శాతం వాటాను అరబిందో రియల్టీకి విక్రయించిన GMR

  • Published By: venkaiahnaidu ,Published On : September 25, 2020 / 04:14 PM IST
కాకినాడ సెజ్ లో 51శాతం వాటాను అరబిందో రియల్టీకి  విక్రయించిన GMR

కాకినాడ సెజ్ లో తమ కంపెనీకున్న 51శాతం వాటాను అరబిందో రియాల్టీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి విక్రయిస్తున్నట్లు GMR ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తెలిపింది. దీనిపై ఇవాళ అధికారికంగా కంపెనీ ప్రకటన చేసింది. అనుబంధ సంస్థ జీఎంఆర్‌ సెజ్‌ అండ్‌ పోర్ట్‌ హోల్డింగ్(GSPHL)‌ ద్వారా కేఎస్‌ఈజెడ్‌లో తమకుగల 51 శాతం వాటాను విక్రయించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది.



డీల్‌ విలువ రూ. 2,610 కోట్లు. తొలి దశలో రూ. 1,600 కోట్లను అందుకోనున్నట్లు GMR తెలియజేసింది. మిగిలిన రూ.1010 కోట్లు ఒప్పందంలో భాగంగా రెండు, మూడేళ్లలో పలు దశల్లో చెల్లిస్తారు.ఈ డీల్ తర్వాత మొత్తం వందశాతం KSEZ అరబిందో రియాల్టీ చేతికి వెళుతుంది.


డీల్‌లో భాగంగా కేఎస్‌ఈజెడ్‌లో వాటాతోపాటు.. కాకినాడ గేట్‌వే పోర్ట్‌ లిమిటెడ్‌లో కేఎస్‌ఈజెడ్‌కు గల 100 శాతం వాటాను సైతం అరబిందో రియల్టీకి బదిలీ చేయనున్నట్లు వివరించింది