నిపుణుల కమిటీ రద్దు చేయాలి : ఏపీ రాజధానిపై హైకోర్టులో పిటిషన్

  • Published By: madhu ,Published On : December 19, 2019 / 07:00 AM IST
నిపుణుల కమిటీ రద్దు చేయాలి : ఏపీ రాజధానిపై హైకోర్టులో పిటిషన్

ఏపీలో మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనతో రాజకీయాలు ఒక్కాసారిగా వేడెక్కాయి. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజధాని నిర్మాణం, ప్రణాళికపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తూ…ప్రభుత్వం..జీవో నెంబర్ 585 విడుదల చేసింది. దీనిని సవాల్ చేస్తూ..హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజధాని రైతుల పరిరక్షణ సమితి పేరిట న్యాయవాది అంబటి సుధాకర్ 2019, డిసెంబర్ 19వ తేదీ గురువారం పిటిషన్ దాఖలు చేశారు. 

రాజధాని నిర్మాణం చేస్తామంటూ..రైతుల వద్ద గత ప్రభుత్వం భూములు తీసుకొనే విషయాన్ని వారు పిటిషన్‌లో గుర్తు చేశారు. నిర్మాణ సాధ్యసాధ్యాలపై కమిటీ వేయడాన్ని తప్పు బట్టింది. వెంటనే జీవోను రద్దు చేయాలని కోరింది. ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వం సమర్పించాలని కోర్టు సూచించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేసును ఫిబ్రవరి 03కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. 

* ఏపీలో మూడు రాజధానుల అవసరం ఉందన్నారు సీఎం జగన్. 
* 2019, డిసెంబర్ 17వ తేదీ మంగళవారం అసెంబ్లీలో అమరావతి రాజధానిపై వాడివేడి చర్చ జరిగింది. 
* ఏపీకి మూడు రాజధానులు వస్తాయేమోనని సంచలన వ్యాఖ్యాలు చేశారు జగన్. పాలన ఒక చోట, జ్యుడీషియల్ మరో చోట ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అమరావతిలో లెజిస్లేటివ్ * కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో హైకోర్టు, జ్యుడీషియల్ కేపిటల్ ఏర్పాటు చేయొచ్చన్నారు. 
 

* ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే తప్పేంటని సీఎం జగన్ ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
* ఈ ప్రకటనతో ఒకే దగ్గర ఉన్న అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. 
* అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్, హైకోర్టు ఏర్పాటు కాబోతున్నాయి. 
* ఏపీలో పాలన వికేంద్రీకరణ జరుగనుంది.